ప్ర‌ణ‌య్ ప‌రువు హ‌త్య‌పై పూన‌మ్ సంచ‌ల‌న ట్వీట్

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

heroine poonam kour
Updated:  2018-09-17 03:55:06

ప్ర‌ణ‌య్ ప‌రువు హ‌త్య‌పై పూన‌మ్ సంచ‌ల‌న ట్వీట్

మిర్యాల గూడ ప‌రువు హ‌త్య ఘ‌ట‌న ఇరు తెలుగు రాష్ట్రాల‌ను ఆశ్చ‌ర్యానికి గురిచేసిన సంగ‌తి తెలిసిందే. సొంత తండ్రి మారుతీరావు త‌న కుమార్తె త‌క్కువ కుల‌స్తుడు అయిన ప్ర‌ణ‌య్ ను వివాహం చేసుకుంద‌నే ఉద్దేశంతో న‌డిరోడ్డుపై అత్యంత పాశ‌వికంగా చంపించాడు. 
 
ఇక ఈ ఘ‌ట‌న‌ను సీరియ‌స్ గా తీసుకున్న పోలీస్ అధికారులు అమృత తండ్రిని, ఆమె బాబాయ్ ల‌ను ఏ1, ఏ2 నిందితులుగా అలాగే వారితో పాటు మ‌రో ఇద్ద‌రిని అరెస్ట్ చేసి రిమాండ్ కు త‌ర‌లించారు. ఇక ఈ ఘ‌ట‌న‌పై ఇరు తెలుగు రాష్ట్రాల ప్ర‌జ‌లు, చిత్ర ప‌రిశ్ర‌మ‌కు చెందిన న‌టిన‌టులు సోష‌ల్ మీడియాను వేదిక‌గా చేస‌కుని ప్ర‌ణ‌య్ ఆత్మ‌కు శాంతి క‌ల‌గాల‌ని, అలాగే అమృత‌కు ప్ర‌గాఢ సానుభూతిని వ్య‌క్తం చేస్తున్నారు. 
 
అయితే ఇదే క్ర‌మంలో హీరోయిన్ పూన‌మ్ కౌర్ స్పందించారు. మ‌నం 21వ శ‌తాబ్దంలో ఉన్నాము ఇంకా ఇలాంటి మూస ఆలోచ‌న‌ల‌ను ప‌ట్టించుకోవ‌డం ఏంట‌ని ఆమె వ్యాఖ్యానించారు. ప్ర‌ణ‌య్ హ‌త్య త‌న‌ను క‌ల‌చి వేసింద‌ని పూన‌మ్ ట్వీట్ చేసింది.
poonam tweet
 
ప్ర‌జ‌లంతా ప్రేమకు వ్య‌తిరేకంగా ఎందుకున్నారు ! ఇలాంటి ప‌నులు ద్వారా ఏం సాధించారు ! అమృత, ప్ర‌ణ‌య్ జంట‌కు న్యాయం జ‌రిగేది ఎప్పుడు..! మ‌నం నిజంగా 21వ శాతాబ్దంలో ఉన్నామా..! ప్ర‌ణ‌య్ హ‌త్య, అమృత రోద‌న నా మ‌న‌సును క‌ల‌చివేస్తోంది. అంటూ ట్వీట్ చేసింది పూన‌మ్. అంతేకాదు ప్ర‌ణ‌య్-అమృత ప్రీ- వెడ్డింగ్ ప్ర‌స్తుతం సోషల్ మీడియ‌లో వైర‌ల్ అవుతున్న వీడియోను పోస్ట్ చేసింది ఈ ముద్దుగుమ్మ‌.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.