పూన‌మ్ ఏంటిది ప‌వ‌న్ పై ట్వీట్ నిజ‌మేనా...

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

pawan kalyan and poonam kour image
Updated:  2018-03-16 03:12:05

పూన‌మ్ ఏంటిది ప‌వ‌న్ పై ట్వీట్ నిజ‌మేనా...

కొద్దిరోజుల క్రితం ఇటు పవ‌న్ క‌ల్యాణ్ అభిమానులు, అటు సినీ క్రిటిక్ క‌త్తి మ‌హేష్ సోష‌ల్ మీడియాను వేదిక‌గా చేసుకుని ఒక‌రిపై ఒక‌రు త‌మ‌దైన శైలిలో విమ‌ర్శ‌లు చేసుకుంటూ వార్త‌ల్లో నిలిచిన సంగ‌తి  మ‌నంద‌రికీ తెలిసిందే.. సోష‌ల్ మీడియాలో ఈ వివాదం సుమారు నాలుగు నెల‌ల పాటు కొన‌సాగింది... అయితే ఈ వివాదంలోకి పంజాబీ బ్యూటీ పూన‌మ్ కౌర్ చేర‌డంతో ఈ వ్య‌వ‌హారం మ‌రింత‌ ర‌స‌వ‌త్త‌రంగా మారిన సంగ‌తి తెలిసిందే... ఈ వ్య‌వ‌హారం ఎక్క‌డిదాక వెలుతుందో అన్న నెపంతో జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ ఆదేశాల‌మేర‌కు అభిమానులు కత్తి మ‌హేష్ ఓ ప్ర‌ముఖ మీడియా సాక్షిగా ఒక్క‌ట‌య్యారు... 
 
దీంతో వీరి ఒప్పందం ప్ర‌కారం ప‌వ‌న్ అభిమానులు, క‌త్తి మ‌హేష్ ఒక‌రిపై ఒక‌రు విమ‌ర్శ‌ల ట్వీట్లు  చేసుకోలేదు... కానీ పూన‌మ్ కౌర్ పెట్టిన పోస్ట్ కు మాత్రం ఇప్ప‌టికీ పెనుదుమారాన్నే రేపుతోందన్న విష‌యంలో అతిశ‌యోక్తి లేదు... అయితే కొద్ది రోజుల క్రితం పూన‌మ్ ప్ర‌త్య‌క్షంగా కాకుండా ప‌రోక్షంగా ప‌వ‌న్ పై అలాగే ఆయ‌న అభిమానుల‌పై వ్య‌తిరేకంగా ట్వీట్ చేసి సోష‌ల్ మీడియాలో సంచ‌ల‌నంగా నిలిచింది.
 
అయితే తాజాగా మ‌రోసారి సోష‌ల్ మీడియాను వేదిక‌గా చేసుకుని పూన‌మ్ త‌న‌దైన శైలిలో విమ‌ర్శ‌లు చేసి వార్త‌ల్లో నిలుస్తున్నారు... కాన్సెప్ట్ కాపీ చేసి… డైలాగ్స్ కాపీ చేసి.. బట్టలు మార్చుకున్నట్టు.. మనుషుల‌ను మారుస్తూ.. మాట మీద ఉండకపోవడం.. జనాల అమాయకత్వంతో ఆడుకుంటూ.. వేషభాషలు మారుస్తూ జనాలను మభ్య పెట్టి.. అమ్మాయిలను అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేస్తున్నారు కొంత మంది.. ఆ భగవంతుడే నిజం ఏంటనేది తెలియచెప్పాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అంటూ ప‌రోక్షంగా పేరు ప్ర‌స్తావించ‌కుండా ట్వీట్ చేశారు పూన‌మ్...
 
అయితే ఆమె చేసిన పోస్ట్ పై కొంత‌మంది నెటిజ‌న్లు వ్య‌తిరేకంగా ట్వీట్ చేస్తున్నారు... పూన‌మ్ కౌర్ పేరు ప్ర‌స్తావించ‌కపోయినా  కానీ ఈ ట్వీట్ ప‌వ‌న్ క‌ల్యాణ్ ను ఉద్దేశించి పెట్టిన పోస్టేన‌ని అంటున్నారు నెటిజ‌న్లు... గ‌తంలో కూడా క‌త్తి మ‌హేష్ తో ప‌వ‌న్ అభిమానులు ఇక  వివాదాల‌కు పుల్ స్టాప్  పెట్టిన త‌ర్వాత కూడా పూన‌మ్ ట్వీట్ చేశార‌ని అంటున్నారు.....ఇదంతా తాను సెల‌బ్రిటీ కావ‌డానికి  చేస్తున్న కామెంట్స్ అని, ప్ర‌స్తుతం చిత్ర ప‌రిశ్ర‌మ‌లో సినిమా అవ‌కాశాలు రాకా పూన‌మ్ కౌర్ ఆడుతున్న నాట‌కాల‌ని నెటిజ‌న్లు అంటున్నారు.
 
అయితే ఈ క్ర‌మంలో నెటిజ‌న్లు చెప్పిన విధంగా ఆలోచిస్తే ప‌వ‌న్ క‌ల్యాణ్ జనసేన ఆవిర్భావ సభ పూర్తయిన మరుసటి రోజు పూనమ్ పోస్ట్ చేయడంతో ఇది క‌చ్చితంగా ప‌వ‌న్ ఉద్దేశించే పెట్టిన పోస్ట్ అని తెలుస్తోంది... అయితే మ‌రి ఈ విష‌యంపై జ‌న‌సేన అధినేత  స్పందిస్తారా ! లేక ఈ వ్య‌వ‌హారంలోకి మ‌ళ్లీ క‌త్తి మ‌హేష్ దూరి క‌త్తి నూరుతాడా అన్న‌ది ప్ర‌స్తుతం స‌స్పెన్స్ గా మారుతోంది.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.