బాహుబలి సెంటిమెంట్ ని ఫాలో అవుతున్న ప్రభాస్

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

prabhas
Updated:  2018-07-27 04:55:11

బాహుబలి సెంటిమెంట్ ని ఫాలో అవుతున్న ప్రభాస్

"బాహుబలి" లాంటి భారి బ్లాక్ బస్టర్ తరువాత యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న సినిమా "సాహో". "రన్ రాజ రన్" ఫేం అయిన సుజీత్ ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నాడు. అయితే ఈ మూవీ యొక్క షూటింగ్ గత ఏడాది స్టార్ట్ అయ్యింది. ఇక త్వరలోనే ఈ సినిమా యొక్క రిలీజ్ డేట్ ని ప్రకటించేద్దాం అనే ఆలోచనలో ఉన్నారు మూవీ యూనిట్.

ప్రభాస్ అయితే ఈ సినిమాని "బాహుబలి 2" రిలీజ్ అయిన ఏప్రిల్ 28 కి రిలీజ్ చేయాలి అని భావిస్తున్నాడు అంట. ఎందుకంటే ఆ డేట్ అంటే ప్రభాస్ కి చాలా సెంటిమెంట్ అంట అందుకే ఆ రోజే "సాహో" ని కూడా రిలీజ్ చేద్దాం అనేది ప్రభాస్ ప్లాన్.

ఆ లోపు షూట్ కూడా పూర్తి చేసి సినిమాని రెడీ గా ఉంచాలి అని సుజీత్ అండ్ టీం కి కూడా ప్రభాస్ చెప్పాడు అంట. యువి క్రియేషన్స్ వారు ప్రొడ్యూస్ చేస్తున్న ఈ సినిమాలో శ్రద్ధ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమా తెలుగు, తమిళ ఇంకా హిందీ బాషలలో రిలీజ్ అవుతుంది. 

 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.