నిహారిక కోసం వస్తున్న ప్రభాస్

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

young rebel star prabhas and niharika
Updated:  2018-07-19 04:25:34

నిహారిక కోసం వస్తున్న ప్రభాస్

మెగా వారసురాలు అయిన నిహారిక ఇంకా సుమంత్ అశ్విన్ జంటగా నటించిన సినిమా "హ్యాపీ వెడ్డింగ్". లక్ష్మణ్ కార్య డైరెక్ట్ చేసిన ఈ సినిమా ని యువి క్రియేషన్స్ వారు ఇంకా పాకెట్ సినిమా వారు కలిసి ప్రొడ్యూస్ చేసారు. పోస్ట్ ప్రొడక్షన్ అన్ని కార్యక్రమాలు అన్ని పూర్తి చేసుకున్న ఈ సినిమా జూలై 27 న గ్రాండ్ గా రిలీజ్ అవుతుంది.

అయితే ఈ సినిమాకి సంభందించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ఈ నెల 21 హైదరబాద్ లో జరపాలి అని ప్లాన్ చేసారు మూవీ యూనిట్. ఈ ఈవెంట్ కి ప్రభాస్ ఇంకా మెగా స్టార్ చిరంజీవిని చీఫ్ గెస్ట్ గా పిలిచింది అంట నిహారిక.

మెగా స్టార్ అయితే నిహారిక తన కూతురు కాబట్టి తప్పకుండా వస్తాడు అలాగే ప్రభాస్ కూడా యువి క్రియేషన్స్ తన సొంత బ్యానర్ కాబట్టి రావడానికి తప్పకుండా ట్రై చేస్తాడు. మొత్తానికి ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వీళ్ళిద్దరూ వస్తే మాత్రం సినిమాకి ఎక్కడ లేని హైప్ వస్తుంది. శక్తి కాంత్ కార్తీక్ సంగీతం అందించిన ఈ సినిమాకి ఎస్.ఎస్.తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ని అందించాడు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.