ప్రభాస్ చూపు... కొత్త బిజినెస్‌ వైపు

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

prabhas
Updated:  2018-10-08 11:57:17

ప్రభాస్ చూపు... కొత్త బిజినెస్‌ వైపు

బాహుబలి తో తన రేంజ్ ని అమాంతం పెంచుకున్న నటుడు ప్రభాస్.. ఈ రేంజ్ వల్ల భారీస్థాయి యాడ్స్ చేసాడు ప్రభాస్.. అంతేకాకుండా యువి క్రియేషన్స్ బ్యానర్ పై సినిమాలు కూడా నిర్మిస్తున్నాడు యంగ్ రెబెల్ స్టార్.. దీనితో డబ్బుకు కొదవ లేకపోవడంతో మరో కొత్త బిజినెస్ లో అడుగుపెట్టాడు డార్లింగ్. తన మిత్రులైన యువి క్రియేషన్స్ భాగస్వామ్యంతో ఈ బిజినెస్ మొదలు పెట్టాడు.

ఇంతకీ ప్రభాస్ స్టార్ట్ చేసిన కొత్త బిజినెస్ ఏంటంటే, థియేటర్ ల లీజు లేదా థియేటర్ ల కొనుగోలు.. ఇంతకుముందే యువి క్రియేషన్స్ చేతిలో కొన్ని థియేటర్ లు , మల్టీప్లెక్స్ లు ఉండగా తాజాగా వాటి సంఖ్యని మరింతగా పెంచాలని, డిసైడ్ అయ్యారట ! రెండు తెలుగు రాష్ట్రాలలో ఉన్న కొన్ని థియేటర్ లను లీజు కి తీసుకోవడం కానీ కొనడం కానీ చేసి వాటి రూపురేఖలు మార్చేసి కొత్త కొత్త సినిమాలను అందులో ప్రదర్శించాలని చూస్తున్నారు..

ప్రభాస్ తో పాటు యూవీ క్రీయేషన్స్ వాళ్ళు కూడా సినిమాలకి దగ్గరగా ఉండడం వల్ల, తెల్సిన బిసినెస్ అయితేనే మంచిది అని ఇది చేస్తున్నారు.. ప్రభాస్ ఎలాగూ సినిమాల్లో నటిస్తున్నాడు అలాగే  కొన్ని సినిమాలు యూవీ క్రీయేషన్స్ ద్వారా నిర్మిస్తున్నారు.. దానికి తోడు కొన్ని సినిమాలను ఏరియాల వారీగా కొంటూ పంపిణీ చేస్తున్నారు అందుకే థియేటర్ ల లీజు కి దిగారు ప్రభాస్ అండ్ కో.. ఏదేమైనా డార్లింగ్ చేసే బిసినెస్ మంచి సక్సెస్ అవ్వాలని కోరుకుందాం.. ప్రస్తుతం ప్రభాస్ "సాహో"సినిమా షెడ్యూల్ లో బిజీ గా గడుపుతున్నాడు..

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.