క‌న్‌ఫ్యూజ‌న్‌లో ప్రభాస్

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

hero prabhas
Updated:  2018-07-20 16:41:15

క‌న్‌ఫ్యూజ‌న్‌లో ప్రభాస్

యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం "సాహో" అనే సినిమాలో నటిస్తున్నాడు అనే సంగతి అందరికి తెలిసిందే. ప్రస్తుతం హైదరబాద్ లో షూటింగ్ అరుపుకుంటున్న ఈ సినిమా మొన్నే దుబాయ్ షెడ్యూల్ ని పూర్తీ చేసుకొని వచ్చింది. బట్ ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది.

అదేంటంటే అసలు ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు కంప్లీట్ అవుతుందో అనే క్లారిటీ మూవీ యూనిట్ కి కూడా లేదు అంట. ఈ సినిమా తెలుగు లో మాత్రమే తెరకెక్కితే ఇది ఓకే కాని హిందీ లో అలా కాదు, బాలీవుడ్ లో పెద్ద సినిమాలు వాటి రిలీజ్ డేట్ ని ఆరు నెలల ముందే ఫిక్స్ చేసుకొని ప్రమోషన్స్ తో రెడీ గా ఉంటారు. 

ఇప్పుడు ఈ విషయమే ప్రభాస్ ఇంకా అతని టీం ని కలవర పెడుతుంది. ఇప్పటికే ఈ సినిమాని ఎరోస్ ఇంటర్నేషనల్ వాళ్లకి కొన్ని కోట్ల మొత్తానికి అమ్మేసారు నిర్మాతలు. ఇది కూడా జరిగి చాలా కాలం అవుతుంది కాని షూటింగ్ మాత్రం ఇంకా పూర్తి కాలేదు. సుజీత్ మాత్రం చాలా కథ మీద కథనం మీద నమ్మకంతో పూర్తి స్థాయి యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకేక్కిస్తున్నాడు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.