సాహో సీక్రెట్స్ చెప్పిన ప్ర‌భాస్

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

Updated:  2018-06-21 15:44:27

సాహో సీక్రెట్స్ చెప్పిన ప్ర‌భాస్

బాహుబ‌లి హిట్ తో ఇప్పుడు ప్ర‌భాస్ సాహో సినిమాలో న‌టిస్తున్నారు.. ఈ చిత్రం పై ఇప్ప‌టికే అభిమానులు ఎన్నో హోప్స్ పెట్టుకున్నారు.. ఇందులో ఆయ‌న లుక్ ఎలా ఉంటుందా అని ఎదురుచూస్తున్నారు ఆయ‌న అభిమానులు.. మ‌రో ప‌క్క ఆయ‌న చిత్రాలు అంటేనే ఇప్పుడు ఎంతో క్రేజ్ పెరిగింది.. అందుకే సాహోకు అప్పుడే మార్కెట్లో ఎంతోమంది ఎదురుచూస్తున్నార‌ట‌... యంగ్ రెబ‌ల‌ర్ స్టార్ ప్ర‌భాస్ సాహో చిత్రం షూటింగ్ ప్ర‌స్తుతం దుబాయ్ లో జ‌రుగుతోంది. ఇక్క‌డ  పెద్ద పెద్ద సెట్లతో మూడు సీన్లు తొలి షెడ్యూల్ లో తెర‌కెక్కించారు.
 
ప్ర‌భాస్ కు జోడిగా ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ శ్ర‌ద్దాక‌పూర్ న‌టిస్తోంది హీరోయిన్ గా..సుజిత్ ద‌ర్శ‌క‌త్వంలో ఈ చిత్రం తెర‌కెక్కుతోంది..ఈ స‌మ‌యంలో సాహో గురించి కొన్ని విష‌యాలు ఆయ‌న వెల్ల‌డించారు.. ఈ సినిమాలో శ్ర‌ద్దా పాత్ర‌తోనే సినిమా మొద‌లు అవుతుంది అని చెప్పారు ప్ర‌భాస్.. ఆమెది సినిమాలో చాలా కీల‌క‌మైన పాత్ర‌, ఇందులో మొత్తం 11 కీల‌క పాత్ర‌లు ఉన్నాయి అని అన్నారు. తెలుగులో శ్ర‌ద్ద డైలాలుగు చెప్ప‌డానికి ఒక్క‌టేక్ కూడా తీసుకోవ‌డం లేదు, ఆమె తెలుగు బాగా నేర్చుకుంది అని అన్నాడు యంగ్ రెబ‌ల్ స్టార్.
 
ఇక నాకు షోలే, ద‌బాంగ్ సినిమాలు అంటే చాలా ఇష్ట‌మ‌ని, సాహో త‌ర్వాత ఏ ప్రాజెక్ట్ చెయ్యాలో ఇంకా ఆలోచించుకోలేద‌ని అన్నారు ఆయ‌న‌. బ‌హుశా వ్య‌వ‌సాయంచేయ‌చ్చు లేదా వ్యాపారం చెయ్యచ్చు అని అన్నారు ఆయ‌న‌..సాహో సినిమా అంద‌రికి న‌చ్చుతుంది.. క‌థ బాగా న‌చ్చితేనే సినిమా ఒప్పుకుంటా అందులో భాగంగా ఈ సినిమా ఒప్పుకున్నా అంద‌రికి ఈ సినిమా న‌చ్చుతుంది అని అన్నారు ప్ర‌భాస్.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.