పుట్టిన రోజు సందర్భంగా ప్ర‌భాస్ పెళ్లి ప్ర‌క‌ట‌న‌

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

darling prabhas
Updated:  2018-09-27 10:38:26

పుట్టిన రోజు సందర్భంగా ప్ర‌భాస్ పెళ్లి ప్ర‌క‌ట‌న‌

టాలీవుడ్ రెబల్ స్టార్ ప్ర‌భాస్... త‌న పెళ్లి విష‌యం ఎప్పుడెప్పుడు చెబుతారా అని దేశ‌వ్యాప్తంగా ఉన్న అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురుచుస్తున్నారు. అయితే గ‌తంలో ప్ర‌భాస్ హీరోయిన్  అనుష్క‌ను వివాహాం చేసుకుంటార‌ని సోషల్ మీడియాలో వార్త‌లు వ‌చ్చాయి.  ఈ వార్త‌ను విన్న అభిమానులు ఎంతో సంతోషించారు. ఇక త‌మ‌పై వ‌స్తున్న వార్త‌లపై ప్ర‌భాస్ కొన్ని సంద‌ర్భాల్లో స్పందించ‌క‌పోయినా స్వీటి మాత్రం మీడియా స‌మ‌క్షంలో అనేక సార్లు స్పందించింది. 
 
త‌న‌కు ప్ర‌భాస్ మంచి మిత్రుడ‌ని అంత‌కు మించి తమ మ‌ధ్య‌ ఎలాంటి రిలేష‌న్ షిప్ లేద‌ని స్ప‌ష్టం చేసింది. అయితే ఇదేక్ర మంలో తాజాగా సోషల్ మీడియాలో మ‌రో వార్త‌ వైర‌ల్ అవుతుంది.  అక్టోబ‌ర్ 23న ప్ర‌భాస్ పుట్టిన రోజు ఘ‌నంగా జ‌రుపుకోనున్న నేప‌థ్యంలో ఆయ‌న కుటుంబ స‌భ్యుల‌కు ఓ కీల‌క ప్ర‌క‌ట‌న చేయ‌నున్నార‌ట‌. 
 
అదేంటంటే ఆయ‌న పెళ్లి వార్త వివ‌రించ‌నున్నార‌ని సోష‌ల్ మీడియాలో వార్త‌లు వ‌స్తున్నాయి. ఇక ఈ వార్త‌ను విన్న  అభిమానుల‌కు 23వ తేది ఎప్పుడెప్పుడు వ‌స్తుందా అని ఎదురు చూస్తున్నారు. కాగా ప్ర‌స్తుతం వ‌రుస సినిమాల షూటింగ్ లో బిజిగా గ‌డుపుతున్నారు ప్ర‌భాస్ . ద‌ర్శ‌కుడు సుజిత్ ద‌ర్శక‌త్వంలో తెర‌కెక్కుతున్న సాహో చిత్రం విడుద‌ల కోసం అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.