అనుపమ పై ఫైర్ అయిన ప్రకాష్ రాజ్

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

Updated:  2018-07-09 14:48:46

అనుపమ పై ఫైర్ అయిన ప్రకాష్ రాజ్

మన ఇండస్ట్రీ నటీనటులు ఇతర నటీనటుల పై ఫైర్ అవ్వడం చాలా మామూలు విషయం. ఎందుకంటే పని ఒత్తిడి వల్ల లేకపోతే మనస్పర్దల వల్ల గాని ఇది జరగోచ్చు. అయితే ఇటివలే స్టార్ నటుడు అయిన ప్రకాజ్ రాజ్ యువ నటి అయిన అనుపమ పరమేశ్వరన్ పై ఫైర్ అయినట్టు తెలుస్తుంది. అనుపమ పరమేశ్వరన్ ఇంకా ప్రకాష్ రాజ్ ఇద్దరు కలిసి రామ్ హీరో గా వస్తున్న "హలో గురు ప్రేమకోసమేరా" అనే మూవీ లో నటిస్తున్నారు.

అయితే ఈ మూవీ సెట్స్ లోనే ప్రకాష్ రాజ్ అనుపమ పై గట్టిగా అరిచాడు అంట. ప్రకాష్ రాజ్ లాంటి సీరియస్ నటుడు అలా అరవగానే అనుపమ ఇక కంట్లో నుంచి నీళ్ళు వచ్చి అక్కడే ఏడ్చేసింది అని తెలుస్తుంది.

మరి ప్రకాష్ రాజ్ అనుపమ పై ఎందుకు ఫైర్ అయ్యాడు, అసలు ఆ సినిమా సెట్స్ లో ఎం జరిగింది అనే విషయాలు మాత్రం ఎవ్వరికి తెలియదు. ఇదిలా ఉంటే "నేను లోకల్" ఫేం అయిన త్రినాద్ రావు నక్కిన డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాని దిల్ రాజు ప్రొడ్యూస్ చేస్తున్నాడు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకి ప్రసన్న కుమార్ కథ మాటలు అందిస్తున్నాడు. 

 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.