సినీ న‌టుడు ప్రకాష్ రాజ్ కు రాజ్యసభ

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

actor prakash raj image
Updated:  2018-03-11 04:06:23

సినీ న‌టుడు ప్రకాష్ రాజ్ కు రాజ్యసభ

రాష్ట్రంలో రాజ్యసభ స్థానాల‌కు ఎన్నిక‌ల‌ నోటిఫికేష‌న్ వెలువ‌డిన విష‌యం అంద‌రికి తెలిసిందే.అయితే కర్నాటక కాంగ్రెస్ పార్టీ నుంచి రాజ్యసభ అభ్యర్థిగా ప్ర‌ముఖ  నటుడు ప్రకాష్ రాజ్‌ను ఎంపిక చేయించాలంటూ ప‌లువురు నాయ‌కులు అలోచ‌న చేస్తున్నార‌ట‌. అదే విష‌యాన్ని ముఖ్య‌మంత్రి సిద్ద‌రామ‌య్య‌కు సైతం విన్న‌వించిన‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి.
 
అయితే ప్ర‌కాష్‌రాజ్ స‌మాజం ప‌ట్ల ఎంతో అవ‌గాహ‌న క‌లిగినవారు.  దేశంలో ప్ర‌జ‌లు ఎదుర్కోంటున్న స‌మ‌స్య‌ల‌ను  మీడియా ద్వారా ప్ర‌భుత్వాల‌ దృష్టికి తీసుకెళ్లుతున్న విష‌యం అంద‌రికి తెలిసిందే. అయితే ఇటీవ‌ల త‌మిళ రైతుల స‌మ‌స్య‌ల పై, జ‌ల్లీక‌ట్టు లాంటి ఉద్య‌మాల పై స్వ‌యంగా స్పందించి ప్ర‌జ‌ల‌కు అండ‌గా నిలిచారు. ఇటీవలికాలంలో హ‌త్య‌కు గురైన పాత్రికేయురాలు గౌరి లంకేష్ విష‌యం పై  ప్రధాని మోడీ పైన,బిజెపి పైన పలు విమర్శలు చేసి పలువురి దృష్టిని ఆకర్షించారు ప్రకాష్ రాజ్‌.   
 
ప్ర‌స్తుతం కర్నాటకలో  ఎన్నిక‌లు జ‌ర‌గ‌బోతున్న నేప‌థ్యంలో ప్రకాష్ రాజ్ కు రాజ్యసభ టిక్కెట్ కేటాయిస్తే కాంగ్రెస్ కు లాభం కలుగుతుందని ఆ ప్రతిపాదన చేసిన వారు చెబుతున్నారు. అందువ‌ల్ల‌ ముఖ్యమంత్రి సైతం ఎఐసిసి పెద్దలతో కూడా మాట్లాడారని అంటున్నారు. అన్ని అనుకున్న‌ట్లే జ‌రిగితే రాజ్యసభకు ప్రకాష్ రాజ్ వెళ్ల‌వ‌చ్చు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.