సెట్ లో అందరి ముందు గొడవ పెట్టుకున్న ప్రకాష్ రాజ్

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

Updated:  2018-08-25 17:18:10

సెట్ లో అందరి ముందు గొడవ పెట్టుకున్న ప్రకాష్ రాజ్

మొన్నా మధ్య తెలుగు సినిమా ఇండస్ట్రీ మొత్తం ప్రకాష్ రాజ్ ని బహిష్కరించాలంటూ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్, నిర్మాతల సంఘాలు పట్టుబట్టాయి. ఆ తర్వాత పరిస్థితి సర్దుమణిగింది ప్రకాష్ రాజ్ యధాతదంగా మన సినిమాల్లో నటిస్తూనే ఉన్నారు. నటనలో ఆరితేరిన ఈ ఘనుడు వివాదాల్లో కూడా తరచూ మెరుస్తూ ఉంటున్నాడు.

ఎప్పటికప్పుడు రాజకీయాల్లో ఎన్ డి. ఎ కు వ్యతిరేకంగా తన గొంతును వినిపించే ఈయన తాజాగా మరో వివాదం లో చిక్కుకున్నాడు.  దిల్ రాజు నిర్మాణం లో, నక్కిన త్రినాధరావు దర్శకత్వం లో, హీరో రామ్ అనుపమ పరమేశ్వరన్ జంటగా రాబోతున్న "హలో గురు ప్రేమకోసమే" అనే చిత్రం లో ప్రకాష్ రాజ్ కూడా ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ చిత్ర షూటింగ్ లో కెమెరామెన్ విజయ్ కే చక్రవర్తి తో గొడవ పడ్డాడు అంట ప్రకాష్ రాజ్.

విజయ్ కూడా ఎక్కడ తగ్గకపోవడం తో గొడవ కాస్తా చినికి చినికి పెద్దగా మారి సినిమా నిర్మాతకి తలనొప్పి తెచ్చిపెట్టింది. దిల్ రాజు తో మంచి స్నేహం కారణంగా ఈ గొడవ పెద్దరూపం దాల్చకపోయినా వారిరువురి మధ్య మనస్పర్థలు అయితే తగ్గలేదు అని వినికిడి. కాగా సెట్ లో వాతావరణం అంత బానే ఉంది ఎవరిమధ్య ఎటువంటి గొడవలు లేవు అని దిల్ రాజు తీసిపడేశాడు. ఇదిలా ఉంటే ఈ సినిమా అక్టోబర్ 18 న గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతుంది.

 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.