మిర్యాల‌గూడ‌లో మ‌రో వివాదం

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

pranayamrutha
Updated:  2018-09-25 06:12:48

మిర్యాల‌గూడ‌లో మ‌రో వివాదం

మిర్యాలగుడ‌లో కుల దుర‌హంకార హ‌త్య‌కు గురి అయిన ప్ర‌ణ‌య్ విగ్ర‌హం ఏర్పాటు పై ప్ర‌స్తుతం వివాదం చ‌ల‌రేగుతోంది. ప్ర‌ణ‌య్ విగ్ర‌హానికి మ‌ద్ద‌తుగా కొంద‌రూ, ఇందుకు అభ్యంత‌రం వ్య‌క్తం చేస్తూ మ‌రికొంద‌రూ ఇరు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా గ‌ళం విప్పుతున్నారు. ప్ర‌ణ‌య్ విగ్ర‌హం ఏర్పాటు చేస్తే శాంతి భ‌ద్ర‌త‌ల స‌మ‌స్య‌లు త‌లెత్తే ప్ర‌మాదం ఉంద‌ని ఓ వ‌ర్గం హెచ్చ‌రిస్తోంది. 
 
ఇక మ‌రోవైపు ఎట్టి ప‌రిస్థితిలో ప్ర‌ణ‌య్ విగ్రహన్ని ఏర్పాటు చేసి తీరుతామ‌ని అమృత తేల్చి చెబుతోంది. విగ్ర‌హ ఏర్పాటుకు అడ్డుప‌డితే తాను ప్ర‌ణయ్ కుటుంబ స‌భ్యుల‌తో కలిసి దీక్ష‌కు దిగుతాన‌ని అమృత హెచ్చ‌రిస్తోంది. దీంతో విగ్ర‌హ వివాదం తారాస్థాయికి చేరుకోవ‌డంతో మ‌ళ్లీ మిర్యాలగూడ‌లో టెన్ష‌న్ వాతావ‌ర‌ణం నెల‌కొంది.
 
ప‌ట్ట‌ణంలోని సాగ‌ర్ రోడ్డు వ‌ద్ద శ‌కుంత‌లా థియేట‌ర్ వ‌ద్ద ప్ర‌ణ‌య్ విగ్ర‌హాన్ని ఏర్పాటు చెయ్యాల‌ని ప్ర‌ణ‌య్ కుటుంబ స‌భ్యులు డిమాండ్ చేస్తున్నారు. అయితే దీనికి అన్ని ప్ర‌జా సంఘాలు ద‌ళిత భ‌హుజ‌న, గిరిజ‌న కుల‌వివక్ష‌త పోరాట స‌మితుల‌తో పాటు మ‌రికొన్ని సంఘాలు మ‌ద్ద‌తు ప‌లికాయి. ఈ విగ్ర‌హం నిర్మిస్తే కులాంతర విహాల‌ను ప్రోత్స‌హించేలా గుర్తింపు వ‌స్తుంద‌ని ప్రజా సంఘాలు అంటున్నాయి. 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.