పోలీస్ స్టేషన్ లో గొడవకి దిగిన పవన్ కళ్యాణ్ హీరోయిన్

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

pawan kalyan
Updated:  2018-09-10 01:20:11

పోలీస్ స్టేషన్ లో గొడవకి దిగిన పవన్ కళ్యాణ్ హీరోయిన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో "తమ్ముడు" సినిమాలో హీరోయిన్ గా నటించిన ప్రీతి జింగ్యాని అందరికి గుర్తుండే ఉంటుంది. ఆ సినిమాలో తెలుగు లో అడపాదడపా సినిమాలు చేసిన కూడా "తమ్ముడు" సినిమా ద్వారే ఫేమస్ అయ్యింది ఈ భామ. పెళ్ళయ్యకా సినిమాలు మానేసిన ఈ భామ ముంబై కి తన మఖాం మార్చి ఫ్యామిలీ తో హ్యాపీగా ఉంటుంది.
 
చాలా కాలంగా బయట కనిపించని ఆమె తాజాగా మీడియా ముందుకు వచ్చింది. తన ఏడేళ్ళ కొడుకుపై చేయి చేసుకున్న పక్క అపార్ట్ మెంట్ లో నివాసం ఉండే వ్యక్తిపై ప్రీతీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఓ పెద్దాయన తన కుమారిడిపై చేయి చేసుకోవడంతో పాటు అపార్ట్ మెంట్ బయటకు గెంటేశాడు అంటూ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.
 
అసలు తన కొడుకు పై ఎవరో వ్యక్తీ చెయ్యి చేసుకోవడం ఏంటి అంటూ పోలీస్ స్టేషన్ లో గొడవకి దిగింది అంట ఈ భామ. దాంతో పోలీసులు ఇరు కుటుంబాలకు కౌన్సిలింగ్ ఇచ్చి, సర్దిచెప్పి పంపారని తెలుస్తుంది. ఇదిలా ఉంటే ఈ భామ సినిమాలకి స్వస్తి చాలా కాలం అవుతుంది.

షేర్ :