తెలుగులో ఆ హీరోకి క‌న్నుకొట్ట‌నున్న ప్రియా ?

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

Updated:  2018-02-21 11:54:24

తెలుగులో ఆ హీరోకి క‌న్నుకొట్ట‌నున్న ప్రియా ?

కొద్ది రోజులుగా సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేస్తోన్న‌ చిత్రం !! ఒరు ఆదార్ ల‌వ్ !! ఈ చిత్రంలో న‌టించిన హీరోయిన్ ప్రియా ప్ర‌కాశ్ గురించి  ప్ర‌స్తుతం దేశ మంతా చ‌ర్చించుకుంటోంది... ఈ చిత్రంలో త‌న కంటి భాష‌తో హీరోనే కాకుండా ఈ వీడియో చూస్తున్న ప్ర‌తీ ఒక్క‌రిని  మ‌త్తెక్కిస్తోంది ప్రియా.
 
ఇటీవ‌లే ఈ సినిమాకు సంబంధించి ట్రైల‌ర్, సాంగ్ ను విడుద‌ల చేసింది చిత్ర యూనిట్.. ఈ  ట్రైల‌ర్ లో ప్రియా  త‌న అందంతో కుర్ర‌కారును ఎలా ల‌వ్ లో దించాలో ఈ వీడియో చూసిన ప్ర‌తీ ఒక్క‌రికి ఇట్టే అర్థ‌మ‌వుతోంది... ఈ చిత్రంలో న‌టించ‌క ముందు దేశానికి కాదు క‌దా! క‌నీసం మ‌ల‌యాళ‌ ప్రేక్ష‌కులకు కూడా తెలియ‌దు ఈ క‌నుసైగ‌ల ముద్దు గుమ్మ‌.
 
కేవ‌లం ఒరు ఆదార్ ల‌వ్ చిత్రంలో న‌టించి, అతి త‌క్కువ స‌మయంలోనే గూగుల్ సెర్చింజ‌న్ లో శృంగార తార స‌న్నీలియోన్ ను దాటిపోయింది  ప్రియా...ఈ సినిమాతో అంత పాపులారిటీ తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ కోసం ప‌లు చిత్ర ప‌రిశ్ర‌మ‌ల‌కు చెందిన ద‌ర్శ‌క నిర్మాత‌లు వారు తెర‌క్కించ‌నున్న‌ చిత్రంలో ప్రియా న‌టిస్తే ఆమెకు భారీ ఆఫ‌ర్ ప్ర‌క‌టిస్తున్నార‌ట‌.
 
అయితే తాజా స‌మాచారం ప్ర‌కారం తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌లో ప్రియా ప్ర‌కాశ్ న‌టించ‌నున్నార‌ట‌... హీరో నిఖిల్ న‌టించ‌నున్న‌ తాజా చిత్రంలో ప్ర‌కాశ్ స‌ర‌స‌న చేయ‌నున్నార‌ట‌.. కాగా ఇందుకోసం చిత్ర యూనిట్ ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రంగా చేస్తున్న‌ట్లు తెలుస్తోంది. ఆమె ఒకే చేస్తే షూటింగ్ డేట్లు కూడ ఫిక్స్ చేయ‌నున్నార‌ట‌ చిత్ర  బృందం. 
 
ఇటీవ‌ల ప్రియా ప్ర‌కాశ్ పాపులారిటీ చూసి తెలుగు లోనే కాకుండా హిందీ,త‌మిళంలో కూడా ఈమెకు భారీ ఆఫర్లు వ‌స్తున్న‌ట్లు సినీ వ‌ర్గాల స‌మాచారం.. మొత్తానికి  ఒక్క క‌ను సైగ‌తోనే కోట్లాది మంది అభిమానుల‌నే కాకుండా ప‌లు చిత్ర ప‌రిశ్ర‌మ‌ల‌కు చెందిన నిర్మాత‌ల‌ను కూడా క్యూ క‌ట్టిస్తోంది ప్రియా ప్ర‌కాశ్.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.