మొన్న కంటి చూపుతో నేడు గ‌న్‌తో

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

Updated:  2018-02-14 06:43:12

మొన్న కంటి చూపుతో నేడు గ‌న్‌తో

గ‌త రెండు రోజుల నుంచి   సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేస్తోన్న చిత్రం  !! ఒరు అదార్ ల‌వ్ !! ఈ సినిమాలో మ‌ల‌యాళ న‌టి ప్రియా ప్ర‌కాశ్  న‌టించారు... ఇప్ప‌టికే ఈ చిత్రానికి సంబంధించి ఓ సాంగ్ లోని ట్రైల‌ర్ ను విడుద‌ల చేశారు చిత్ర యూనిట్.. ఆమె అందంతో, క‌నుచూపు భాష‌తో  అబ్బాయిల‌ను ఎలా ల‌వ్ లో దించాలో ఈ వీడియో చూసిన ప్ర‌తీ ఒక్క‌రికి అట్టే తెలిసిపోతోంది... ప్ర‌కాశ్ చేసిన క‌నుచూపు భాష‌ను ఇప్పుడు ప్ర‌తీ ఒక్క‌రు నేర్చుకుంటున్నారు...  క‌నుసైగ‌లు చెప్పే మాట‌ల‌కు య‌వ్వ‌న వ‌య‌స్సులో ఉన్న యువ‌కుల గుండెల‌ను పిండెస్తోంది ప్రియా.
 
అయితే తాజాగా ప్రేమికుల దినోత్స‌వాన్ని పుర‌స్క‌రించుకుని ఈ సినిమాకు సంబంధించి మ‌రో పాట‌లోని స‌న్నివేశ ట్రైల‌ర్ ను  పేక్ష‌కుల‌కు కానుక‌గా విడుద‌ల చేశారు చిత్ర యూనిట్... ఈ ట్రైల‌ర్ లోని స‌న్నివేశం ఏంటంటే... సాధార‌ణంగా ప్రేమికులు ఫ్లైయింగ్ కిస్ ఇచ్చుకునేది మ‌నం చాలా చోట్ల చూసివుంటాం...
 
కానీ ఇటీవ‌ల ఈ సినిమా ట్రైల‌ర్ లో ప్రియా ప్ర‌కాశ్ త‌న ఫ్లైయింగ్ కిస్ ను గ‌న్ లో లోడ్ చేసి త‌న చేతి గ‌న్ తో ప్రియుడిని కాల్చేసింది... దీంతో త‌న ప్రియుడే కాకుండా దెబ్బ‌కు ఈ వీడియో చూసిన‌ ప్ర‌తీ ఒక్క‌రు వారి వారి ప్రాణాల‌ను వ‌దిలేశారు... అలా యువ‌కులు ప్రాణాలు వ‌దిలేయ‌డంతో  ఉన్న‌ట్లుండి ఆ వీడియోతో మ‌రోసారి సోష‌ల్ మీడియాలో ప్రియా ప్ర‌కాశ్ దూసుకు వెళ్తోంది.. ఏంటీ న‌మ్మ‌రా ఈ వీడియో చూస్తే మీకే అర్థ‌మ‌వుతుంది ఒ లుక్కెయ్యండి 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.