పెళ్లి కి ముందు బ్యాచిలర్ పార్టీ ఇచ్చిన ప్రియాంక చోప్రా

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

priyanka chopra
Updated:  2018-11-06 04:16:16

పెళ్లి కి ముందు బ్యాచిలర్ పార్టీ ఇచ్చిన ప్రియాంక చోప్రా

బాలీవుడ్ కి బై చెప్పి హాలీవుడ్ కి వెళ్లి అక్కడ తనకన్నా పదేళ్లు చిన్న అయిన నిక్ జోసస్ తో డేటింగ్ చేసింది ప్రియాంక చోప్రా. అన్ని కుదిరాక ఇంట్లో వాళ్ళని ఒప్పించి ఒక్కటి అవ్వబోతున్నారు ఈ జంట. డిసెంబర్ లో ఈ జంట హిందు సాంప్రదాయం ప్రకారం పెళ్లి తో ఒక్కటి కానున్నారు.

అబ్బాయిలు మాత్రమే బాచిలర్ పార్టీలు జరుపుకోవాలా అనే రీతిలో ప్రియాంక చోప్రా కూడా సహచరులకు బాచిలర్ పార్టీ ఇచ్చింది అంట.డిసెంబర్ 1న జోధ్ పూర్ లో ఈ వివాహం జరగనున్న నేపథ్యంలో  బ్యాచిలరెట్ పార్టీ ని నెదర్లాండ్ లోని ఆమ్ స్టర్ డ్యామ్ లో ఇచ్చింది ప్రియాంక చోప్రా . ఈ పార్టీకి తన చెల్లెలు అయిన హీరోయిన్ పరిణీతి చోప్రా కూడా హాజరయ్యింది . ఇక ఆ పార్టీలో ఫుల్లుగా మద్యం తాగేసి రచ్చ రచ్చ చేశారట అక్కాచెల్లెళ్లు.

రిణీతి చోప్రా , ప్రియాంక చోప్రా లు మాత్రమే కాదు ఇంకా చాలామంది అమ్మాయిలు పాల్గొన్నారట ఈ పార్టీలో . వీర లెవల్లో రెచ్చిపోయి హంగామా చేశారట. మద్యం తాగి, సిగరెట్లు కాల్చి మరో లెవెల్ లో మేము దేంట్లోనూ తక్కువ కాదు అంటూ చెలరేగిపోయారంట. హాలీవుడ్ వరకు వెళ్ళిన వాళ్ళకి ఇవి పెద్ద విచిత్రం కాదులే అని గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి. ఎవరు ఏమి మాట్లాడిన డోంట్ కేర్ అనే మనస్తత్వం గల ప్రియాంక ఈ మాటలు పట్టించుకుంటుంది అని అయితే ఎవరు అనుకోరు.