నటి పార్వతి ని ఇబ్బంది పెడుతున్న..అమ్మ

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

actor parvathi
Updated:  2018-10-24 12:15:18

నటి పార్వతి ని ఇబ్బంది పెడుతున్న..అమ్మ

ఆ మధ్య మలయాళ హీరోయిన్ భావన కిడ్నాప్ అయ్యి, లైంగికంగా వేధింపులకు గురి అయ్యారు.. చేసింది కూడా సొంత గూటి పక్షే, అదే మళయాళ చిత్ర పరిశ్రమ కి చెందిన నటుడు దిలీప్.ఈ విషయంలో దిలీప్ ని విచారించి, అరెస్ట్ కూడా చేసారు.కొన్నాళ్ల పాటు జైలు జీవితాన్ని కూడా గడిపాడు. బెయిల్ పై బయటకు వచ్చిన ,  ఒక మహిళను కిడ్నాప్ చేసి - లైంగికంగా వేదించిన కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న వ్యక్తిని మలయాళ మూవీ ఆర్టిస్టు అసోషియేషన్ (అమ్మ)లోకి తీసుకోవడంపై కొందరు నిరసన వ్యక్తం చేశారు.

విచారణ ఎదుర్కొంటున్న దిలీప్ ను ఎలా అమ్మలోకి రానిస్తారు -ఆయనకు సినిమాల్లో ఛాన్స్ లు ఎలా ఇస్తారు అంటూ కొందరు దిలీప్ ని వ్యతిరేకించారు.దిలీప్ కు వ్యతిరేకంగా పోరాడిన వారిలో హీరోయిన్ పార్వతిది చాలా కీలక పాత్ర. దిలీప్ ను అమ్మలోకి తీసుకోవడంతో కొందరు ప్రత్యేకంగా సంఘంను పెట్టుకున్నారు. ఆ సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు అవకాశాలు లేక ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంటున్నారట. ఆ సంఘంలో సభ్యులుగా ఉన్న వారికి మలయాళ సినిమాల్లో ఆఫర్లు రాకుండా కొందరు అడ్డుకుంటున్నారని కొందరు వాపోతున్నారు.

నకు కూడా కేవలం ఒకే ఒక్క సినిమా చేతిలో ఉందని - తాను ప్రస్తుతం చాలా ఇబ్బందులను ఎదుర్కొంటున్నట్లుగా పార్వతి చెప్పింది. బెంగళూరు డేస్’ చిత్రంతో పాటు పలు మలయాళ చిత్రాలతో ఆకట్టుకున్న పార్వతికి ఇప్పుడు అవకాశాలు లేకపోవడం దారుణం అంటూ కొందరు మలయాళ చిత్ర వర్గాల వారు బాధని వ్యక్తం చేస్తున్నారు.