ఎన్టీఆర్ సినిమా వల్ల ఇబ్బందుల్లో క్రిష్

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

Updated:  2018-07-13 12:35:18

ఎన్టీఆర్ సినిమా వల్ల ఇబ్బందుల్లో క్రిష్

నందమూరి బాలకృష్ణ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న సినిమా "ఎన్టీఆర్". ఈ సినిమాకి మొదట దర్శకుడిగా మొదట తేజ ని అనుకున్నా గాని తరువాత కొన్ని కారణాల వల్ల తేజ ని తీసేసి క్రిష్ ని దర్శకుడిగా పెట్టుకున్నాడు బాలకృష్ణ.

అయితే క్రిష్ బాలీవుడ్ లో "మణికర్ణిక" అనే సినిమాతో బిజీగా ఉన్న టైం లో బాలకృష్ణ "ఎన్టీఆర్" సినిమా ఆఫర్ ని ఇచ్చాడు. అలా "మణికర్ణిక"ను వదిలేసి క్రిష్ ఇప్పుడు పూర్తిగా "ఎన్టీఆర్" పై మనసు పెట్టలేకపోతున్నాడట. అసలైతే "మణికర్ణిక" షూటింగ్ పూర్తయ్యాకే క్రిష్ "ఎన్టీఆర్" సినిమా షూటింగ్ స్టార్ట్ చేసాడు.

కాని "మణికర్ణిక"ను ఓ కొలిక్కి తీసుకొచ్చేశాననుకున్న క్రిష్‌ ఆలోచన తారుమారైంది. "మణికర్ణిక" సినిమాలోని కొన్ని సీన్స్‌ విషయంలో నిర్మాతలు సంతృప్తి చెందకపోవడంతో మళ్లీ ఆ సీన్స్‌ని రీ షూట్‌ చేయాల్సి వస్తోందట. దాంతో ఇప్పుడు క్రిష్ కి పెద్ద సమస్యే వచ్చి పడినట్టు తెలుస్తుంది. ఎందుకంటే రెండు భారీ ప్రాజెక్ట్స్ ఏ కాబట్టి రెండు సినిమాలని ఒకే సారి హ్యాండిల్ చేయలేడు క్రిష్. మరి క్రిష్ ఈ రెండు సినిమాల్లో ఏది ముందు ఫినిష్ చేస్తాడో వేచి చూడాలి.

 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.