ఎన్టీఆర్ బ‌యోపిక్ పై అభ్యంత‌రాలు బాల‌య్యకు నోటీసులు

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

Updated:  2018-06-30 16:54:39

ఎన్టీఆర్ బ‌యోపిక్ పై అభ్యంత‌రాలు బాల‌య్యకు నోటీసులు

మాజీ ముఖ్య‌మంత్రి తెలుగుదేశం పార్టీ వ్య‌వ‌స్థాప‌కుడు నంద‌మూరి తార‌క రామారావు జీవిత‌ చ‌రిత్ర‌ను ఆధారంగా చేసుకుని ద‌ర్శ‌కుడు క్రిష్ సినిమాను తెర‌కెక్కిస్తున్న‌సంగ‌తి తెలిసిందే. అయితే ఇప్ప‌టికే చిత్ర యూనిట్ ఎన్టీఆర్ అనే టైటిల్ తో పాటు ఒక పోస్ట‌ర్ ను కూడా విడుద‌ల చేసింది. ఈ చిత్రాన్ని 2019 సార్వ‌త్రిక ఎన్నిక‌ల స‌మ‌యంలోపు తెర‌పైకి తీసుకురావాల‌నే ఉద్దేశంతో ద‌ర్శ‌కుడు క్రిష్ ఈ చిత్రానికి సంబంధించి క‌థ‌ను ఫాస్ట్ గా రెడి చేసుకుంటున్నారు.
 
అయితే ఇప్ప‌టికే కొన్ని పాత్ర‌ల‌కు స్క్రిప్ట్ రెడి కావ‌డంతో చిత్ర యూనిట్ రెగ్యుల‌ర్ షూటింగ్ కు టెంకాయ కొట్టిన సంగ‌తి తెలిసిందే. వారు ఏ ముహూర్త‌న‌ రెగ్యుల‌ర్ షూటింగ్ మొద‌లు పెట్టారో తెలియ‌దు కానీ షూటింగ్ మొద‌లుపెట్టిన ప్ర‌తీసారీ ఏదో ఒక రూపంలో ఆటంకం త‌గులుతూనే ఉంది. గతంలో ఈ సినిమాకు ద‌ర్శ‌క బాధ్య‌త‌లును తేజ స్వీక‌రించారు కానీ, ఆయ‌న ఊహించ‌ని ప‌రిణామాల నేప‌థ్యంలో ఈ సినిమా బాధ్య‌త‌ల నుంచి తొల‌గిపోయారు. 
 
ఆ త‌ర్వాత రాఘ‌వేంద్ర‌రావు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తార‌ని అనుకున్నారు. కానీ, ఆయ‌న కూడా చేయ‌లేదు. ఇటు స్వియ ద‌ర్శ‌క‌త్వం బాల‌య్య చేస్తారు అని అంద‌రూ అనుకున్నారు. ఇక‌ చివ‌ర‌కు క్రిష్ సినిమా బాధ్య‌త‌లు తీసుకున్నారు. క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో సినిమా షూటింగ్ సాఫిగా సాగుతుంద‌న్న క్ర‌మంలో మ‌రోసారి అభ్యంత‌రాలు త‌లెత్తాయి. నాదేండ్ల ఫ్యామిలీ హీరో బాల‌కృష్ణ‌కు ద‌ర్శ‌కుడు క్రిష్ కు నోటీసులు పంపారు. 
 
ఈ సినిమాలో నాదేండ్ల గురించి స్పెష‌ల్ గా తీయ‌నున్నార‌నే నేప‌థ్యంలో బాల‌కృష్ణ ఒపినీయ‌న్ ను తెలుసుకునేందుకు ఎమ్మెల్యే హోదాను ఉద్దేశించి ఒక నోటిసును, హీరోగా ఒక నోటిసులు పంపారు. ఇక ఈ నోటీసుల‌పై బాల‌య్య‌బాబు స్పందించాల్సి ఉంది. మ‌రోవైపు ఇదే చిత్రాన్ని విల‌క్ష‌ణ ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ ల‌క్ష్మీస్ అనే టైలిల్ తో తెర‌కెక్కించ‌బోతున్న సంగ‌తి తెలిసిందే. అయితే ఆ చిత్రానికి ఎన్టీఆర్ భార్య ల‌క్ష్మీపార్వ‌తి వ్య‌తిరేకిస్తున్నారు. చూడాలి మ‌రి రానున్న రోజుల్లో ఈ చిత్రం ఇంకెన్ని సంచ‌ల‌నాలు సృష్టిస్తుందో.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.