"RX 100" మిస్ చేసుకున్న ఆ ప్రొడ్యూసర్ కొడుకు ఎవరు ?

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

rx 100
Updated:  2018-08-28 02:17:04

"RX 100" మిస్ చేసుకున్న ఆ ప్రొడ్యూసర్ కొడుకు ఎవరు ?

"RX 100" ఈ సినిమా జూలై లో రిలీజ్ అయ్యి ఘన విజయం సాధించింది. ఈ సినిమాని డైరెక్ట్ చేసిన అజయ్ భూపతి ఈ కథని ఒక ప్రొడ్యూసర్ కొడుక్కి అనుకున్నాడు అంట. ఆ ప్రొడ్యూసర్ మరెవరో కాదు "పెళ్లి చూపులు" అనే సినిమా బ్లాక్ బస్టర్ సినిమాని తెలుగు ప్రేక్షకులకి అందించిన రాజ్ కందుకూరి.
 
అజయ్ భూపతి రాజ్ కందుకూరి కొడుకు శివ కందుకూరి కోసం ఈ కథని అనుకున్నాడు అంట. కానీ రాజ్ కందుకూరి మాత్రం అప్పుడు టైం ఇస్తా ఇప్పుడు టైం ఇస్తా అని చెప్పి ఇప్పటి వరకు అజయ్ కి కథ చెప్పడానికి టైం ఇవ్వలేదు అంట. ఇక ఈ టైం గ్యాప్ లో అజయ్ వేరే ప్రొడ్యూసర్ ని వెతుక్కుని కార్తికేయ రెడ్డి ని హీరోగా పెట్టి "RX 100" ని డైరెక్ట్ చేసాడు.
 
కేవలం రాజ్ కందుకూరి డైరెక్టర్ కి కథ చెప్పడానికి సమయం ఇవ్వకపోవడం మూలాన ఇప్పుడు శివ కందుకూరి ఒక మంచి సినిమాని మిస్ చేసుకున్నాడు అని అంటున్నారు ఇండస్ట్రీ జనాలు. ఇదిలా ఉంటే శివ అతి త్వరలో వేరే ఒక మంచి డైరెక్టర్ తో కలిసి ఇండస్ట్రీ లోకి హీరో గా ఎంట్రీ ఇవ్వనున్నాడు అని టాక్.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.