శృతిప్రాబ్లం తెలుసుకోవాలంటున్న నిర్మాత‌లు

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

sruthi hasan
Updated:  2018-06-22 11:34:21

శృతిప్రాబ్లం తెలుసుకోవాలంటున్న నిర్మాత‌లు

దీపం ఉండ‌గానే ఇళ్లు చ‌క్కబెట్టుకోవాలి ఇప్పుడు ఏ సినిమా హీరో అయినా హీరోయిన్ అయినా ఇదే ఫాలో అవుతారు.. ముఖ్యంగా హీరోయిన్లు ఈ సూత్రాన్ని 100 కి 100 శాతం పాటిస్తారు.. ఇక సౌత్ బ్యూటీ శృతీ హాస‌న్ ఇప్పుడు టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ల‌లో ఒక‌రు అనేది తెలిసింది. ఆమె న‌టించిన చిత్రాలు అన్నీ వ‌రుస హిట్లే.. అయితే కెరియ‌ర్ బాగున్న స‌మ‌యంలో ఆమె తీసుకుంటున్న కొన్ని నిర్ణ‌యాలు ఆమె కెరియ‌ర్ పై ప్ర‌భావం చూపుతున్నాయి అంటున్నారు కొంద‌రు..
 
ఆమె కెరియ‌ర్లో స‌రైన నిర్ణ‌యాలు తీసుకోకుండా, అలాగే చేతికి వ‌చ్చిన మంచి ఆఫ‌ర్ల‌ను వ‌దులుకుంటోంద‌ని బాధ‌ప‌డుతున్నారు. క‌మ‌ల్ కూతురిగా ఎంట్రీ ఇచ్చిన ఆమెకు మొద‌ట్లో ప్లాప్ లు వెల్ కం చెప్పాయి.. త‌ర్వాత ఆమెకు ప‌వ‌న్ క‌ల్యాణ్ గ‌బ్బ‌ర్ సింగ్ సినిమాతో మంచి హిట్ వ‌చ్చిన‌ట్టైంది...ఇక గ్లామ‌ర్ వ‌ల‌గ‌బోయ‌డంలో ఈ భామ స్టైలే వేరు... సినిమా ఇండ‌స్ట్రీని తాను చిన్న త‌నం నుంచి చూస్తున్నా త‌న‌కు అన్నీ తెలుసు అని లెక్చ‌ర్స్ కూడా ఇచ్చింది.
 
ఇక కెరియ‌ర్ ను ప‌క్క‌న పెట్టేసి మ‌ళ్లీ ప్రేమ అంటూ ల‌వ‌ర్ కు ద‌గ్గ‌ర అయింది ఈ భామ‌... ఇక ఈ ల‌వ్ మ‌ళ్లీ ప‌క్క‌న పెట్టి మ‌ళ్లీ సినిమాలు చేయాల‌ని మంచి క‌థ‌ల కోసం వెయిట్ చేస్తోంద‌ట‌..బ‌డా హీరోల‌తో పాటు చిన్న హీరోల‌తో న‌టించేందుకు కూడా ఈమె ఒప్పుకుంది అని తెలుస్తోంది.. సంఘమిత్ర లాంటి హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీని గ‌తంలో కాద‌నుకుంది అనే విష‌యం తెలిసిందే.. ఇక మ‌ళ్లీ నిర్మాత‌ల‌కు తాను గ్లామ‌ర‌స్ చిత్రాల‌కు దూరం అంటూ కొత్త కండీష‌న్స్ పెడుతోంది ఈ భామ‌.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.