బిగ్ బాస్ నుంచి పూజ ఎలిమినేట్ కానుందా ?

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

Updated:  2018-08-25 13:12:05

బిగ్ బాస్ నుంచి పూజ ఎలిమినేట్ కానుందా ?

బిగ్ బాస్ 2 షో రోజు రోజుకి రసవత్తరంగా మారుతుంది. ఎందుకంటే ఇప్పుడిప్పుడే ఈ గేమ్ షో లో పాల్గొనే వారు ఇతరులకి గట్టి పోటీని ఇస్తున్నారు. అయితే బిగ్ బాస్ 2 లో ఈ వారం తొలిసారి డబల్ నామినేషన్ చేయనున్నారు అనే న్యూస్ బయటకి వచ్చింది.
 
ఈ డబల్ నామినేషన్ లో పూజ రామచంద్రన్ ఇంకా దీప్తి ఉన్నారు అని టాక్. ఎందుకంటే వీళ్ళిద్దరికీ సోషల్ మీడియా నుంచి ఎటువంటి సపోర్ట్ లేదు. ఒకవేళ ఈరోజు డబల్ నామినేషన్ లేకపోతే మాత్రం దీప్తి కాకుండా పూజ రామచంద్రన్ ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అని తెలుస్తుంది.
 
ఈ వీక్ నామినేషన్స్ లో కౌశల్ ఉన్నా కూడా కౌశల్ ఆర్మీ ఉండగా కౌశల్ బిగ్ బాస్ 2 నుంచి ఎలిమినేట్ అవ్వడు అని అంటున్నారు కౌశల్ ఫ్యాన్స్. ఇప్పటి వరకు చూసుకుంటే హౌస్ లో కౌశల్ ఒక్కడే స్ట్రాంగ్ గా ఉన్నాడు అని అర్ధం అవుతుంది. మరి ఈ వారం పూజ రామచంద్రన్ ఎలిమినేట్ అవుతుందా లేదా అనేది తెలియాలి అంటే ఇంకొక్కరోజు ఆగాల్సిందే.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.