ఇంత ఓవర్ యాక్షన్ అవసరమా?

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

puri akash
Updated:  2018-04-16 03:38:56

ఇంత ఓవర్ యాక్షన్ అవసరమా?

తెలుగు చిత్ర పరిశ్రమకు ఎన్నో హిట్ సినిమాలను అందించి, తన పంచ్ లతో యువతని తన వైపుకు తిప్పుకొన్న దర్శకుడు పూరిజగన్నాథ్... మహేష్ బాబుకి పోకిరి, ఎన్టీఆర్ కి టెంపర్, ప్రభాస్ కి బుజ్జిగాడు, పవన్ కళ్యాణ్ కి కెమరామెన్ గంగతో రాంబాబు, రవితేజకి ఇడియట్ ఇలా ఇండస్ట్రీలో ఉన్న కుర్ర హీరోలందరికీ హిట్ సినిమాలు అందించారు...మెగాస్టార్ చిరంజీవి కుమారుడు రాంచరణ్ తేజ్ ని కూడా చిత్ర పరిశ్రమకు పరిచయం చేసింది కూడా పూరీజగన్నాధ్.
 
పూరిజగన్నాథ్ కుమారుడు ఆకాష్ ని హీరోగా మెహబూబా సినిమాతో వ‌స్తున్నాడు...ఈ సినిమాను పూరిజగన్నాథ్ స్వయంగా నిర్మిస్తూ, దర్శకత్వం అందిస్తున్నారు...ఈ సినిమాకి సంబంధించిన విశేషాలను తెలియజేయడానికి ప్రెస్ మీట్ ని ఏర్పాటు చేసారు...ఈ ప్రెస్ మీట్ లో ఆకాష్ మాట్లాడుతూ మా నాన్న నిన్ను హీరోగా లాంచ్ చేస్తున్నారు కాబట్టి నువ్వు చాలా లక్కీ అంటున్నారు...కానీ మా నాన్నని మెహబూబా సినిమాతో నేను లాంచ్ చేస్తున్నా అని గర్వంగా చెప్పగలను అన్నారు... సినిమా రిలీజ్ కాకముందే ఇంత ఓవర్ యాక్షన్ అవసరమా అంటున్నారు పూరి అభిమానులు...
 
ఇది ఇలా ఉంటె పూరి మాత్రం ఈ ప్రెస్ మీట్ కి హాజరుకాలేదు...ఈ సినిమా ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వస్తుంది.. ఈ సినిమాని దేశవ్యాప్తంగా దిల్ రాజు రిలీజ్ చేస్తున్నారు...దింతో అభిమానుల్లో ఈ సినిమాపైన అంచనాలు పెరిగిపోయాయి.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.