నా ఇల్లు అమ్మేశా

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

director puri jagannadh
Updated:  2018-05-07 06:04:25

నా ఇల్లు అమ్మేశా

తెలుగు చిత్ర‌పరిశ్ర‌మ‌లో మాస్ డైరెక్ట‌ర్ గా పేరు తెచ్చుకున్న వ్య‌క్తి పూరీ జ‌గ‌న్నాథ్... ఆయ‌న సినిమా వ‌స్తుందంటే ప్రేక్ష‌క అభిమానుల‌కు సంద‌డే సంద‌డి... ఇక ఇప్ప‌టికే పూరీ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన చిత్రాల‌న్ని సూప‌ర్ డూప‌ర్ హిట్ అయ్యాయి..ఇక తాజాగా ఆయ‌న ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న చిత్రం మెహ‌బుబా... ఈ చిత్రంలో ఆయ‌న కుమారుడు ఆకాశ్ పూరీ హీరోగా... పూరీ ద‌ర్శ‌క నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు... మొద‌టిసారిగా పూరీ జ‌గ‌న్నాథ్ ఈ సినిమాకు నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రించ‌డం ఆస‌క్తిగా మారుతోంది.
 
ఇక తాజా స‌మాచారం మేర‌కు మెహ‌బుబా సినిమా కోసం పూరీ త‌న‌కున్న ఇళ్ల‌లో ఇక ఇల్లును అమ్మేసి ఈ చిత్రం కోసం ఖ‌ర్చు చేశార‌నే వార్త‌ సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేస్తోంది... అయితే ఇదే విష‌యంపై మీడియా ద్వారా స్పందించారు పూరీ జ‌గ‌న్నాథ్... తాను ఇల్లు అమ్మిన‌ది నిజ‌మే అని కొత్త సినిమా కోసం ఏ నిర్మాత ముందుకు వ‌స్తార‌ని, ఒక వేళ ముందుకు వ‌స్తే ఆనేక ఆంక్ష‌లు ఉంటాయ‌నే నేప‌థ్యంతో త‌న కుమారుడు చిత్రానికి నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నాన‌ని స్ప‌ష్టం చేశారు పూరీ.
 
అయితే త‌న‌కు ఇల్లు అమ్మినందుకు బాధ లేద‌ని, ఈ సినిమా కంటెంట్ మీద అలాగే ఆకాశ్ మీద త‌న‌కు న‌మ్మ‌కం ఉంద‌ని,ఆకాశ్ న‌మ్మ‌కంతోనే నిర్మాత బాధ్య‌త‌ల‌ను చేప‌డుతున్నాన‌ని తెలిపారు పూరీ... అయితే ఇలాంటి వాటి పై తాను పెద్దగా ఆలోచించన‌ని ఏదైనా తిరిగి సంపాదించుకోవడమెలాగో త‌న‌కు బాగా తెలుసు అని చెప్పుకొచ్చారు పూరీ.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.