“అ నుండి ఆహా” వరకు చేసి పెడతా అన్నాడు

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

radhika apte
Updated:  2018-09-19 12:03:09

“అ నుండి ఆహా” వరకు చేసి పెడతా అన్నాడు

కాస్టింగ్ కౌచ్ గురించి బోల్డ్ గా మాట్లాడే అతి తక్కువ బాలీవుడ్ హీరోయిన్స్ లో రాధికా ఆప్టే ఒకరు. అప్పుడెప్పుడో ఒకసారి తనకి టాలీవుడ్ లో ఎదురైనా చేదు అనుభవాల్ని మీడియా ముందు బయట పెట్టింది. కానీ అప్పుడు పేర్లు ప్రస్తావించకుండా జాగ్రత్త పడింది. తాజాగా మళ్ళి ఇలాంటి వ్యాఖ్యలే చేసింది ఈ అందాల ముద్దుగుమ్మ. అర్ధరాత్రి బెడ్ రూంకు వచ్చి నడుము మీద చేయి వేసి రుద్దుతానని ఓ నటుడు అన్నాడని, అతడి మాటలకు షాక్ అయ్యానని చెప్పుకొస్తుంది ఈ బాలీవుడ్ బోల్డ్ బ్యూటీ.

ఇది వరకు చేసినట్లే ఇప్పుడు కూడా చేసింది. ఇప్పుడు కూడా తనతో అసభ్యంగా ప్రవర్తించిన నటుడు ఎవరు అన్నది కూడా వెల్లడించలేదు. షూటింగ్ లో విపారీతంగా అలసిపోయిన తనకి నడుము నొప్పి తీవ్రంగా రావడం తో విశ్రాంతి తీసుకోవడానికి హోటల్ గదికి వెళ్తున్న సమయంలో లిఫ్టులో రాధికా తో పాటు ఒక నటుడు కూడా వచ్చాడంటా ! వస్తే వచ్చాడు, కత్తిలాంటి పిల్ల పక్కనుండి కదా అని కొంటెగా రెండు మాటలు విసిరాడు. నడుం నొప్పితగ్గాలంటె నాకు చెప్పండి. ఈ నైట్ కి వస్తాను.

“అ నుండి ఆహా”  వరకు ఉపశమనం కలిగిస్తాను అంటూ, మర్దన చేసి మొత్తం అన్ని నొప్పులు పోగడతా అని ఓపెన్ గా చెప్పాడంటా!  నేను ఆడ అతడు మగ అలాంటిది నన్ను ఎలా తాకుతాడు . అలా ఎలా మాట్లాడతాడు అంటూ కోపంగా అంటోంది రాధికా ఆఫ్టే. పొద్దున్నే యూనిట్ సబ్యులకు చెప్పడంతో వాళ్ళు చీవాట్లు పెట్టేసరికి సారీ చెప్పాడట ఆ నటుడు.

 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.