నాగార్జునని డైరెక్ట్ చేయడానికి రెడీ అవుతున్న రాహుల్ రవీంద్రన్

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

nagarjuna and rahul ravindran
Updated:  2018-08-16 11:26:08

నాగార్జునని డైరెక్ట్ చేయడానికి రెడీ అవుతున్న రాహుల్ రవీంద్రన్

ఇటివలే "చి.ల.సౌ" అనే సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు హీరో రాహుల్ రవీంద్రన్. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా మంచి హిట్ గా నిలిచింది. ఈ హిట్ తో దర్శకుడిగా ఇప్పుడు మంచి అవకాశాలు తెచ్చుకుంటున్నాడు రాహుల్ రవీంద్రన్.

అయితే అక్కినేని నాగార్జున నుంచి ఒక మంచి ఆఫర్ ని దక్కించుకున్నాడు అంట రాహుల్ రవీంద్రన్. అది కూడా రాహుల్ తో తన బ్లాక్ బస్టర్ హిట్ సినిమా అయిన "మన్మధుడు" సినిమాని రీమేక్ చేయించనున్నాడు అంట నాగార్జున. ఇప్పటికే నాగార్జున "మన్మధుడు 2" అనే టైటిల్ ని నాగార్జున ఫిలిం ఛాంబర్ లో రిజిస్టర్ చేయించాడు.

ప్రస్తుతం కథని డెవలప్ చేసే పనిని రాహుల్ కి అప్పగించాడు అంట నాగార్జున. అన్నపూర్ణ స్టూడియోస్ పైనే ఈ సినిమాని నిర్మించాలి అని డిసైడ్ అయ్యాడు అంట నాగార్జున. మరి ఈ సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుంది హీరోయిన్ గా ఎవరు నటిస్తారు అనే విషయాలు తెలియాల్సి ఉంది. 

 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.