సైలెంట్ గా వివాహం చేసుకున్న రాజమౌళి కొడుకు ?

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

rajamouli son
Updated:  2018-09-06 11:14:30

సైలెంట్ గా వివాహం చేసుకున్న రాజమౌళి కొడుకు ?

"బాహుబలి" తో తెలుగు సినిమాని అందలం ఎక్కించిన దర్శకుడు యస్ యస్ రాజమౌళి కొడుక్కికి సంబంధించిన వార్త ఒకటి సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. "మగధీర" సినిమా నుండి తండ్రుకి చేదోడువాదోడు గా ఉంటున్న రాజమౌళి దత్తపుత్రుడు కార్తికేయ నిశ్చితార్ధం ఈ రోజు జరుగుతుంది.

తాను ఎప్పటినుండో ప్రేమిస్తున్న అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నట్లు సమాచారం. "మగధీర" సినిమా తర్వాత కార్తికేయ ‘ఈగ’ చిత్రానికి గాను ప్రొడక్షన్ మేనేజర్ గా వ్యవహరించాడు. ఆ తర్వాత నాగ చైతన్య నటించిన ‘యుద్ధం శరణం’ సినిమాకి లైన్ ప్రొడ్యూసర్ గా మరియు ‘బాహుబలి-2’ కి రెండవ యూనిట్ కి డైరెక్టర్ గా ఉన్నాడు. తండ్రిలానే ఇతనుకుడా మల్టి టాలెంటెడ్ అని ఆయనతో పనిచేసిన వారు చెప్పుకోవడం సర్వసాధారణం.

తనికి దర్శకత్వం చేసే ఆలోచనలు కూడా ఉన్నాయని కొంతమంది అభిప్రాయ పడుతున్నారు. వ్యాపార రంగంలో కూడా కార్తికేయ అడుగుపెట్టి తాను తండ్రిని మించిన కొడుకు అనిపించుకునే ప్రయత్నంలో ఉన్నాడు. అతను ఒక రెస్టారెంట్ కి యజమాని అని చాలా మందికి తెలియకపోవచ్చు. అయితే అతను తెలంగాణ ప్రీమియర్ కబడ్డీ లీగ్ లో నల్గొండ ఈగల్స్ జట్టుకు ఇతనే యజమాని. దత్తపుత్రుడు అన్న మాటే కానీ ఎప్పుడూ కార్తికేయని సొంతకొడుకు కన్నా ఎక్కువగానే రమరాజమౌళి గారు చూసుకునే వారని అందరూ చెప్పుకుంటూ ఉంటారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.