ఎట్టకేలకు సినిమా ఓకే చేసిన రాజశేఖర్

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

rajasekahr
Updated:  2018-07-21 04:10:27

ఎట్టకేలకు సినిమా ఓకే చేసిన రాజశేఖర్

సీనియర్ హీరో అయిన రాజశేఖర్ గత ఏడాది "గరుడవేగా" అనే యాక్షన్ థ్రిల్లర్ తో తన సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి హిట్టు కొట్టాడు. ప్రవీణ్ సత్తారు ఈ సినిమాని డైరెక్ట్ చేసాడు. ఈ సినిమా తరువాత చాలా కథలు విన్న రాజశేఖర్ మొత్తానికి "అ" మూవీ ఫేం ప్రశాంత్ వర్మ దర్శకుడు చెప్పిన ఒక కథని ఓకే చేసాడు అంట.

అయితే ఈ సినిమాలో ఒక పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో రాజశేఖర్ నటించనున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ప్రశాంత్ "క్వీన్" రీమేక్ లో బిజీ గా ఉన్నాడు. ఈ సినిమా పూర్తవ్వగానే రాజశేఖర్ తో కలిసి సినిమా ని స్టార్ట్ చేస్తాడు. ఇదిలా ఉంటే రాజశేఖర్ ప్రస్తుతం "ఎన్టీఆర్" బయోపిక్ లో కూడా నటిస్తున్నాడు అనే వార్తలు వస్తున్నాయి.

"ఎన్టీఆర్" లో ఒక పాత్ర కోసం బాలకృష్ణ రాజశేఖర్ ని మరి మరి అడిగినట్టు తెలుస్తుంది. ఈ విషయం పై ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. కాని రాజశేఖర్ మాత్రం సెకండ్ ఇన్నింగ్స్ లో చాలా జాగ్రత్తగా కథలు వింటున్నట్టు తెలుస్తుంది.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.