మొత్తానికి క్లారిటీ ఇచ్చిన రాజ‌శేఖ‌ర్

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

actor rajasekhar
Updated:  2018-06-30 11:54:39

మొత్తానికి క్లారిటీ ఇచ్చిన రాజ‌శేఖ‌ర్

సినిమా ఇండ‌స్ట్రీలో స‌క్సెస్ బాట అనేది చాలా త‌క్కువ మందికి ఉంటుంది.. ముఖ్యంగా 90 వ ద‌శకంలో అనేక హిట్ చిత్రాలు చేసి ఇప్పుడు త‌న‌కు యాప్ట్ గా సెట్ అయ్యే క‌ధ‌లు చేస్తున్నారు న‌టుడు హీరో రాజ‌శేఖ‌ర్.. ఆయ‌న సాంగ్స్ కు ఆయ‌న యాక్టింగ్ కు ఇప్ప‌టికీ లేడీ ఫ్యాన్స్ అలానే ఉన్నారు..ఇటు ఇటీవ‌ల రాజశేఖ‌ర్ గ‌రుడ‌వేగ  స‌క్సెస్ ను అందుకున్నారు.. టాలీవుడ్ లో గ‌రుడ‌వేగ పేరుకు త‌గ్గ‌ట్లు వేగంగా ప్ర‌జ‌ల్లోకి వెళ్లింది.. ఈ సినిమాలో యాక్ష‌న్ హీరోగా కుటుంబ హీరోగా అల‌రించాడు రాజ‌శేఖ‌ర్.. 
 
ఇక ఈ సినిమా స‌క్సెస్ తో నిర్మాత‌లు ద‌ర్శ‌కులు ఆయ‌న ఇంటికి  క్యూ క‌డ‌తారు అని అనుకున్నారు.. కాని ఆయ‌న అంత స్పీడుగా సినిమాలు త‌దుప‌రి స్టార్ట్  చేయ‌లేదు.. ఇక నెల‌లు గ‌డిచిపోతున్నా ఆయ‌న సినిమాల‌పై ప్ర‌క‌ట‌న లేక‌పోవ‌డంతో ఇటు టాలీవుడ్ లో ప‌లు వార్త‌లు గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.. ఇక ఇంత గ్యాప్ త‌ర్వాత రాజ‌శేఖ‌ర్ స్వ‌యంగా తన నెక్ట్స్ ప్రాజెక్ట పై అనౌన్స్ మెంట్ చేశాడు.
 
టాలీవుడ్ లో ప్ర‌శాంత్ వ‌ర్మ డైరెక్ష‌న్లో రాజ‌శేఖ‌ర్ కొత్త చిత్రం చేయ‌నున్నారు.. అయితే ఈ సినిమా పై రాజ‌శేఖర్ ఓ మెలిక పెట్టారు.. ఈ సినిమా పేరును ఆయ‌న ప్ర‌స్తావించినట్టే చెప్పి అభిమానుల‌ను క‌న్ఫూజ్ చేశారు..నా నెక్ట్స్ ప్రాజెక్టు గురించి నేను ఒక్కటే చెప్పగలను. అది AWEsome గా ఉండబోతోంది. అని ట్వీట్ పెట్టారు
 
ఈ హింట్ తో ఆయ‌న ఎవ‌రితో సినిమా చేయ‌బోతున్నారు అనేదానిపై క్లారిటీ వ‌చ్చింది. ద‌టీజ్ మ‌హాల‌క్ష్మీ సినిమా 
చేస్తున్నారు ప్ర‌శాంత్ వ‌ర్మ  అది అయిన త‌ర్వాత రాజ‌శేఖ‌ర్ కొత్త చిత్రం ప‌ట్టాలెక్క‌నుంది.. అయితే మ‌రో 40 రోజుల్లో ఈసినిమా పూర్తి చేసి రాజ‌శేఖ‌ర్ సినిమా ప‌ట్టాలెక్కుతుంది అని అంటున్నారు చిత్ర‌యూనిట్. 
 
ఇక ఈ సినిమాకు నిర్మాత‌లుగా కూడా జీవిత రాజ‌శేఖ‌ర్ ఉంటారు అని తెలుస్తోంది.. అయితే మ‌రో ఇద్ద‌రు నిర్మాత‌లు ఈ సినిమా నిర్మిస్తామ‌ని క‌థ న‌చ్చింద‌ని చెబుతున్నా రాజ‌శేఖ‌ర్ జీవిత మాత్రం గ‌త విష‌యాల‌ను దృష్టిలో ఉంచుకుని ఈ సినిమా నిర్మించాలి అని భావిస్తున్నార‌ట‌...ఇటు రాజ‌శేఖ‌ర్ బ‌య‌ట వారికి ఛాన్స్ అంటున్నా ఇటు జీవిత మాత్రం మ‌న‌మే సినిమా నిర్మిద్దాం అని అంటున్నార‌ట‌... ఇటు ఆమె కుమార్తె తొలి సినిమా ఇటీవ‌ల చిత్రీక‌ర‌ణ స్టార్ట్ అయిన విషయం తెలిసిందే... మ‌రి చూడాలి మ‌రో గ‌రుడ‌వేగ‌ను మించిన సినిమా రాజ‌శేఖ‌ర్ నుంచి వ‌స్తుంది అని అభిమానులు ఆశిస్తున్నారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.