స్పీచ్ విని గొడవ పెట్టుకున్న రాజేంద్రప్రసాద్ కుమార్తె

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

actor rajendra prasad
Updated:  2018-10-09 01:12:56

స్పీచ్ విని గొడవ పెట్టుకున్న రాజేంద్రప్రసాద్ కుమార్తె

ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తూ తెరపైన కనిపించే నటకిరీటి రాజేంద్రప్రసాద్ ‘బేవర్స్’ ఆడియో ఫంక్ష‌న్‌లో ఎమోషనల్ అయ్యారు. ఆయన స్పీచ్ విన్నాక..అందరూ ఆశ్చర్యపోయారు. ఆయనకు ఒకే ఒక్క కూతురు అని, తన పేరు గాయత్రి అని చెప్పిన రాజేంద్రప్రసాద్ దాంతో నేను మాట్లాడను.

ఎందుకంటే తను ప్రేమ వివాహం చేసుకుంది. కానీ బేవ‌ర్స్ లో సుద్దాల అశోక్ తేజ్ రాసిన తల్లీ తల్లీ నా చిట్టి తల్లీ పాట విని, నా కూతుర్ని ఇంటికి పిలిపించుకుని మరీ ఆ పాటను మనస్ఫూర్తిగా నాలుగుసార్లు వినిపించాను” అని రాజేంద్రప్రసాద్ ఎమోషనల్ అయ్యారు.

అయితే, ఆ ఎమోషనల్ స్పీచ్ చూసిన గాయత్రి తండ్రితో గొడవ పడ్డారట. తాజా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, ఎమోష‌న్‌లో మా అమ్మాయి గురించి మాట్లాడేశా. సినిమా పరంగా మాట్లాడాల్సిన నేను వ్యక్తిగతంగా అమ్మాయి గురించి చెప్పేశా. అదంతా టీవీల్లో చూసిన గాయత్రి మధ్యలో నా విషయం ఎందుకు చెప్పావ్..? అంటూ గొడవ పెట్టేసింది. ఎదో ఎమోష‌న్‌లో నోరు జారానని ఒప్పుకున్నాను” అని రాజేంద్రప్రసాద్ అన్నారు. అయితే ఇప్పుడు వారి మధ్య తగాదాలు లేవని, శ్రీనివాస కళ్యాణం ఆడియోకి అమ్మాయి, అల్లుడితో కలిసి వెళ్లానని చెప్పారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.