ప్రేమ వ్య‌వ‌హారంపై ర‌కుల్ క్లారిటీ

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

Updated:  2018-01-31 05:06:21

ప్రేమ వ్య‌వ‌హారంపై ర‌కుల్ క్లారిటీ

ఉత్త‌రాది నుంచి వ‌చ్చి తెలుగు చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మలో స‌రైనోడు, ధృవ, మిస్ట‌ర్ వంటి సూప‌ర్ హిట్ సినిమాల‌లో న‌టించి టాలీవుడ్ లో మంచి పేరు తెచ్చుకుంది ర‌కుల్ ప్రీత్ సింగ్... అయితే  ప్ర‌స్తుతం ఈ ముద్దుగుమ్మ వ‌రుస విజ‌యాల‌ను త‌న ఖాతాలో వేసుకోవ‌డంతో, టాలీవుడ్ లోనే కాకుండా బాలీవుడ్, లోను మంచి అవ‌కాశాలు వ‌స్తున్నాయి.
 
అయితే ఈ నేప‌థ్యంలో ర‌కుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా న‌టించిన తాజా  హిందీ చిత్రం అయ్యారీ. ఈ సినిమాలో సిద్ధార్థ్ మ‌ల్హోత్రా హిరోగా న‌టించ‌గా, నీర‌జ్ పాండే ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.. మ‌రికొద్ది రోజుల్లో ప్రేక్ష‌కుల ముందుకు  రానుంది ఈ చిత్రం... అయితే ఈ సినిమా ప్ర‌మోష‌న్స్ కోసం చిత్ర యూనిట్ ప‌లు కార్యక్ర‌మాలు నిర్వ‌హిస్తోంది.
 
 
 తాజాగా ఓ ఛాన‌ల్  నిర్వ‌హించిన  ఇంటర్వూలో  ర‌కుల్ మాట్లాడుతూ... త‌న స‌హ న‌టుడు రానాతో ప్రేమ వ్య‌వ‌హారం న‌డుస్తోంద‌ని ప‌లు ఛాన‌ల్స్ లో వార్త‌లు  వ‌స్తున్నాయ‌ని అన్నారు... అయితే ఈ వార్త‌ల‌లో ఎలాంటి వాస్త‌వం లేద‌ని స్ప‌ష్టం చేశారు.. హైద‌రాబాద్ లో తాను ప్ర‌స్తుతం  సింగిల్ గా ఉన్నాన‌ని, రానా కూడా సింగిల్ గా ఉండ‌డంతో త‌న‌కు ఏ అవ‌స‌రం వ‌చ్చినా వెంట‌నే  గుర్తుకొచ్చే ఫ్రెండ్ రానా అన్నారు ఆమె.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.