వాళ్లే నాకు ఆద‌ర్శం....ర‌కుల్‌ప్రీతి సింగ్‌

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

Updated:  2018-02-02 03:31:34

వాళ్లే నాకు ఆద‌ర్శం....ర‌కుల్‌ప్రీతి సింగ్‌

కెర‌టం సినిమాతో తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌కు ప‌రిచ‌య‌మైన బ్యూటీ  ర‌కుల్‌ప్రీతి సింగ్‌.అయితే వెంక‌టాద్రి ఎక్స్‌ప్రెస్  సినిమాలో త‌న న‌ట‌న‌తో , అందంతో  ప్రేక్ష‌కుల‌ను, చిత్ర ప‌రిశ్ర‌మ‌ను ఆక‌ర్షించింది. వ‌చ్చిన అవ‌కాశాల‌ను స‌ద్వినియోగం చేసుకుంటూ అతి త‌క్కువ స‌మ‌యంలో స్టార్ హీరోయిన్ ఖ్యాతిని సంపాదించుకుంది.
 
తాజాగా  ఒక‌ ఇంటర్వ్యూలో పాల్గొన్న ర‌కుల్‌ప్రీతి సింగ్ ప‌లు ఆస‌క్తిక‌ర‌మైన‌ విషయాలను వెల్లడించింది. చిత్ర ప‌రిశ్ర‌మ‌కు 
వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి నిరంత‌రాయంగా ఎదో ఒక‌టి నేర్చుకోవడం  స‌ర్వ‌సాధార‌ణం అని అంది ఈ ముద్దుగుమ్మ‌. స్టార్‌హీరోలైన‌ మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్ లాంటి న‌టుల‌తో పనిచేయడం వల్లా చాలా నేర్చుకున్నాన‌ని ర‌కుల్ తెలిపారు. ముఖ్యంగా సెట్స్‌లో ఎలా ప్రవర్తించాలి, డైలాగ్ డెలివరీ ఎలా వుండాలి అనే విష‌యాలు బాగా గ‌మ‌నించాన‌ని వెల్ల‌డించింది ర‌కుల్‌ప్రీతి సింగ్‌. ఈ హీరోలే నాకు అద‌ర్శం అని తెలిపింది.
 
 
చిత్ర ప‌రిశ్ర‌మ‌కు రాక ముందు నా జీవితం వేరు....నట జీవితం నన్ను ఏమాత్రం మార్చలేదు. స్టార్ హీరోయిన్ అనే అహంకారం నాకు లేదు.అలా ఎప్ప‌టికి ప్ర‌వ‌ర్తించ‌ను కాని సిల్లీ కాలేజ్ గర్ల్‌లా ఉండాలనుకుంటున్నాను  అని ర‌కుల్‌ప్రీతి సింగ్ తెలిపారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.