ఎన్టీఆర్ బ‌యోపిక్‌లో ర‌కుల్ ఆ పాత్ర‌కి ఫిక్స్‌

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

heroine rakul preet
Updated:  2018-07-18 04:55:56

ఎన్టీఆర్ బ‌యోపిక్‌లో ర‌కుల్ ఆ పాత్ర‌కి ఫిక్స్‌

నందమూరి బాలకృష్ణ హీరో గా "ఎన్టీఆర్" బయోపిక్ తెరకెక్కుతున్న విషయం అందరికి తెలిసిందే. ఇటివలే షూటింగ్ స్టార్ట్ చేసుకున్న ఈ సినిమాని క్రిష్ డైరెక్ట్ చేస్తున్నాడు. తన తండ్రి నందమూరి తారక రామారావు గారి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న సినిమా కాబట్టి కాస్టింగ్ విషయం లో చాలా జాగ్రత్తగా ఉంటున్నాడు బాలకృష్ణ.
 
ఇప్పటికే ఈ సినిమాలో తన తల్లి అయిన బసవతారకం పాత్రలో నటించడానికి బాలీవుడ్ నటి అయిన విద్య బాలన్ ని తీసుకున్నాడు బాలకృష్ణ. అలాగే మహా నటి సావిత్రి పాత్రలో నటించడానికి కీర్తి సురేష్ ని తీసుకున్నాడు. అయితే ఇప్పుడు గ్లామర్ క్వీన్ అయిన శ్రీ దేవి పాత్రలో నటించడానికి రకుల్ ప్రీత్ సింగ్ ని తీసుకున్నాడు బాలకృష్ణ.
 
రకుల్ కూడా మూవీ కి సైన్ చేసినట్టు తెలుస్తుంది. ఇదిలా ఉంటే ఈ రోజు నుంచే విద్య బాలన్ సెట్స్ లో జాయిన్ అయ్యింది. అతి త్వరలో రకుల్ కూడా తన షూటింగ్ పార్ట్ స్టార్ట్ చేయ్యనుంది. వారాహి చలని చిత్రం బ్యానర్ పై సాయి కొర్రపాటి ఈ సినిమాని ప్రొడ్యూస్ చేస్తున్నాడు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.