ర‌కుల్ కు అలాంటి అబ్బాయి కావాలంట మ‌ల్టీమిలియ‌నీర్ ?

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

Updated:  2018-02-10 03:34:55

ర‌కుల్ కు అలాంటి అబ్బాయి కావాలంట మ‌ల్టీమిలియ‌నీర్ ?

కెర‌టం సినిమా తో తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌కు ప‌రిచ‌య‌మై ఆ త‌ర్వాత వెంక‌టాద్రి ఎక్స్ ప్రెస్ సినిమాలో హీరోయిన్ గా న‌టించి మంచి విజ‌యాన్ని త‌న ఖాతాలో వేసుకుంది పంజాబీ బ్యూటీ ర‌కుల్ ప్రీత్ సింగ్... ఈ సినిమా విజ‌యంతో టాలీవుడ్ ఇండ‌స్ట్రీలో వ‌రుస అవ‌కాశాల‌ను ద‌క్కించుకుంటూ హైద‌రాబాద్ లోనే సెటిలైపోయింది ర‌కుల్... తెలుగులోనే కాకుండా హిందీ, త‌మిళ, క‌న్న‌డ వంటి బాషా చిత్రాల‌లో న‌టిస్తోంది ర‌కుల్... అయితే ఈ అమ్మ‌డు ల‌వ్ అపైర్  గురించి గ‌తంలో అనేక వార్త‌లు సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొట్టాయి.
 
హీరో రానాతో ర‌కుల్ ల‌వ్ లో ఉన్నార‌ని,  విరీద్ద‌రూ త్వ‌ర‌లో పెళ్లి కూడా చేసుకోబోతున్నారంటూ  మీడియా ఛాన‌ల్స్ లో వార్త‌లు వ‌చ్చాయి... అయితే ఆ వార్త‌ల‌లో ఏ మాత్రం నిజం లేద‌ని రానా త‌న‌కు క్లోజ్ ఫ్రెండ్ మాత్ర‌మేన‌ని,  గ‌తంలో చెప్పుకొచ్చారు ర‌కుల్...  హైద‌రాబాద్ లో రానా తో పాటు త‌న‌కు చాలా మంది ఫ్రెండ్స్  ఉన్నార‌ని, వారిలో ఒక‌రు బెస్ట్ ఫ్రెండ్ రానా అని అన్నారు ర‌కుల్.
 
అయితే తాజాగా ర‌కుల్ తన పెళ్లి ప్ర‌స్తావ‌న గురించి కొన్ని ఆస‌క్తి క‌ర‌మైన విష‌యాల‌ను ఓ ప్ర‌ముఖ మీడియాలో తెలిపారు... తాను పెళ్లి చేసుకునేవాడు సుమారు 5.9 అడుగులు ఉండాల‌ని అలాంటి వారికోసం వేచి చూస్తున్నాని అంటోంది ర‌కుల్... తాను కోరుకున్న‌వాడితోనే త‌న పెళ్లి జ‌రుగుతుంద‌ని తెలిపారు... తాను మల్టీ మిలియ‌నీర్‌ కావాలని, విదేశాలకు చెందిన వాడు కావాలని కోరుకోవడం లేదన్నారు ర‌కుల్..

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.