రకుల్ కి కూడా అవకాశం ఇస్తున్న ప్రభాస్ ?

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

prabhas and rakul preeth singh
Updated:  2018-07-30 05:03:25

రకుల్ కి కూడా అవకాశం ఇస్తున్న ప్రభాస్ ?

యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ "జిల్" ఫేం అయిన రాధా కృష్ణ దర్శకత్వంలో ఒక సినిమా చెయ్యడానికి రెడీ అవుతున్నాడు అనే సంగతి అందరికి తెలిసిందే. పూర్తి స్థాయి యూరోప్ బ్యాక్ డ్రాప్ లో జరిగే ఈ సినిమాలో పూజ హెగ్డే ని హీరోయిన్ గా తీసుకున్నాడు ప్రభాస్.
 
అయితే కథ పరంగా ఈ సినిమాలో ఇంకో హీరోయిన్ కి కూడా అవకాశం ఉంది అంట, అందుకే ఆ పాత్ర కోసం రకుల్ ప్రీత్ సింగ్ ని తిసుకోనున్నాడు అంట ప్రభాస్. దర్శకుడు రాధా కృష్ణ కి కూడా రకుల్ ఓకే అంట. మొత్తానికి పూజ హెగ్డే తో పాటు రకుల్ కి కూడా అవకాశం ఇచ్చాడు ప్రభాస్.
 
ఇదిలా ఉంటే ప్రస్తుతం ప్రభాస్ "సాహో" షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా షూటింగ్ అయిపోగానే రాధా కృష సినిమా షూటింగ్ స్టార్ట్ చేస్తాడు ప్రభాస్. ఈ సినిమా కూడా "సాహో" లాగే మూడు బాషలలో తెరకెక్కుతుంది.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.