టాలీవుడ్ నుంచి ర‌కుల్ ఔట్‌

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

heroine rakul preet singh
Updated:  2018-08-20 03:26:48

టాలీవుడ్ నుంచి ర‌కుల్ ఔట్‌

తెలుగు లో "కెరటం" అనే సినిమాతో తెలుగు ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది రకుల్ ప్రీత్ సింగ్. ఆ సినిమా ఫ్లాప్ అయిన తరువాత బాలీవుడ్ కి వెళ్లి అక్కడ అవకాశాలు కోసం ట్రై చేసి సక్సెస్ అయ్యింది రకుల్ ప్రీత్ సింగ్. మళ్ళి "వెంకటాద్రి ఎక్ష్ప్రెస్" అనే సినిమాతో తెలుగు సినిమాల్లో రీ ఎంట్రీ ఇచ్చి తెలుగు లో మొదటి విజయాన్ని అందుకుంది రకుల్ ప్రీత్ సింగ్.

ఈ సినిమా హిట్ తరువాత రకుల్ ఇక వెనకాలి తిరిగి చూసుకోవాల్సిన పరిస్థితి రాలేదు. ఎందుకంటే ఆ తరువాత "లౌక్యం" "సరైనోడు" "బ్రూస్ లీ" "ధ్రువ" వంటి మూవీస్ తో స్టార్ హీరోయిన్ రేంజ్ కి వెళ్ళిపోయింది ఈ భామ. కానీ గత ఏడాది సూపర్ స్టార్ మహేష్ బాబుతో కలిసి నటించిన "స్పైడర్" సినిమా మాత్రం రకుల్ ప్రీత్ సింగ్ ని కోలుకోలేని దెబ్బ తీసింది. ఈ సినిమా తరువాత రకుల్ తెలుగు లో ఒక్క సినిమా కూడా సైన్ చేయలేదు. ఎందుకంటే ఆ సినిమా ఫ్లాప్ రకుల్ మార్కెట్ పై పడింది.

ఇప్పుడు రకుల్ ప్రీత్ సింగ్ చేతిలో కేవలం "ఎన్టీఆర్" బయోపిక్ సినిమా మాత్రమే ఉంది. ఇక మార్కెట్ తగ్గింది అని గ్రహించిదో మరి ఏమైందో తెలియదు గాని ఇండస్ట్రీ వదిలి వెళ్లిపోవాలి అని రకుల్ ప్రీత్ సైన్ డిసైడ్ అయ్యింది అని అందుకే సినిమాలు ఏవి ఒప్పుకోవట్లేదు అని ఫిలిం నగర్ టాక్. మరి ఈ న్యూస్ లో ఎంత వరకు నిజం ఉంది అనేది తెలియాలి అంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే. 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.