అల్లు త‌న‌యుడు కోసం చిరు త‌న‌యుడు

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

ram charan and allu arjun
Updated:  2018-04-27 01:28:45

అల్లు త‌న‌యుడు కోసం చిరు త‌న‌యుడు

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, అను ఇమ్మాన్యుయేల్ జంట‌గా తెర‌కెక్కుతున్న‌ చిత్రం నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా... ఈ సినిమా ఎప్పుడెప్పుడు వెండితెర‌పై మెరుస్తుందా అని అని స్టైలిష్ స్టార్ అబిమానుల‌తో పాటు మెగా అభిమానులు కూడా ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు... రామలక్ష్మీ సినీ క్రియేషన్స్ బ్యానర్ లో తెర‌కెక్కుతున్న ఈ చిత్రానికి  వ‌క్కంతం వంశీ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.
 
అయితే ఇప్ప‌టికే  ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని ఆడియో ప్రీ రిలీజ్ కు సిద్ద‌మ‌వుతోంది... ప్ర‌పంచ వ్యాప్తంగా మే 4 న విడుద‌ల కాబోతున్న ఈ చిత్రం కోసం అల్లు అర్జున్ అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురుచుస్తున్నారు... అయితే ఇటీవ‌లే సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి యు/ ఏ స‌ర్టిఫికేట్ పొందింది.. ఈ సినిమాకు సంబంధించి ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్ కూడా ఏప్రిల్ 29న ఏర్పాటు చేసిన‌ట్లు సినీ వ‌ర్గాలు చేబుతున్నాయి.. ఇందు కోసం గ‌చ్చిబౌలి స్టేడియాన్ని ఎంపిక చేసిన‌ట్లు తెలుస్తోంది.
 
ఈ ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్ కు మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ ముఖ్య అతిధిగా విచ్చేయ‌నున్నార‌ని సినీ వ‌ర్గాలు చెబుతున్నాయి... మెగా అభిమానుల స‌మ‌క్షంలో నా పేరు సూర్య - నా ఇల్లు ఇండియా ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్‌ని గ్రాండ్‌గా చేయబోతున్నార‌ని తెలుస్తోంది. ఈ ఫంక్ష‌న్‌కి స్పెష‌ల్ అట్రాక్ష‌న్‌గా మెగా ప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ హ‌జ‌ర‌వడయే కాకుండా ఈ ఫంక్ష‌న్ కు మ‌రికొంత మంది  స్పెష‌ల్ స‌ర్ ప్రైజ్  ఇవ్వ‌నున్నారు అని  చెబుతోంది చిత్రయూనిట్.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.