తండ్రి తో పాటు నటించేందుకు సిద్దం అయిన రామ్ చరణ్

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

chiranjeevi and ram charan
Updated:  2018-07-17 05:09:28

తండ్రి తో పాటు నటించేందుకు సిద్దం అయిన రామ్ చరణ్

ఇండియన్ సినిమాలోనే ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న సినిమా "సై రా నరసింహ రెడ్డి". మెగా స్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న ఈ సినిమా ఉయ్యాలా వాడ నరసింహ రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతుంది. ఇప్పటికే షూటింగ్ మొదలు పెట్టుకున్న ఈ సినిమాని సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేస్తున్నాడు.

ఇదిలా ఉంటే ఈ సినిమాలో గెస్ట్ రోల్ గా రామ్ చరణ్ అలా వచ్చి వెళ్తాడు అట. మూవీ లో వచ్చే కీలకమైన సన్నివేశంలో రామ్ చరణ్ మేరవనున్నాడు. ఇకపోతే రామ్ చరణ్ ఏ స్వయంగా ఈ సినిమాని కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ పై భారి బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు.

నయనతార మెయిన్  హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో తమన్నా సెకండ్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ అయిన అమితాబ్ బచ్చన్ చిరంజీవి గురువు పాత్రలో నటిస్తున్నాడు. జగపతి బాబు, బ్రహ్మాజీ, విజయ్ సేతుపతి, సుదీప్ తదితరులు ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ సినిమా ని రిలీజ్ చేయాలి అని మూవీ యూనిట్ భావిస్తున్నారు. 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.