రాజ‌కీయాల్లోకి రామ్ చ‌ర‌ణ్

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

Updated:  2018-02-17 04:01:14

రాజ‌కీయాల్లోకి రామ్ చ‌ర‌ణ్

మెగా ఫ్యామిలీ నుంచి చిరంజీవి, ప‌వ‌న్ క‌ల్యాణ్ ఇప్ప‌టికే రాజ‌కీయ అరంగేట్రం చేయ‌గా.... అదే బాట‌లోనే వారిని ఆద‌ర్శంగా చేసుకుని మెగా కుటుంబం నుంచి  రాజ‌కీయ నాయ‌కుడిగా వ‌స్తున్నారు హీరో రామ్ చ‌ర‌ణ్... మెగా బ్ర‌ద‌ర్స్ కి రామ్ చ‌ర‌ణ్ కు కాస్థ వ్య‌త్యాసం ఉంది.... అదేంటంటే స‌మాజంలో జ‌రుగుతున్న అన్యాయం, అవినీతి లొసుగుల‌ను బ‌య‌ట ప‌ట్టేందుకు ప‌వ‌న్ క‌ల్యాణ్ జ‌నసేన‌ పార్టీ స్థాపించి రాజ‌కీయాల్లోకి వ‌చ్చారు... కానీ రామ్ చ‌ర‌ణ్  మాత్రం తాను న‌టించిన  చిత్రంలో గ్రామీణ రాజ‌కీయ నాయ‌కుడిగా మార‌బోతున్నార‌ని తాజా స‌మాచారం...
 
గ్రామీణ నేప‌థ్యంలో గోదావ‌రి భాష, బ‌ల‌మైన క‌థ‌తో తెర‌కెక్కుతున్న చిత్రం రంగ‌స్థ‌లం...  ఈ చిత్రం కోసం మెగా అభిమానులంతా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు...ఈ సినిమాకి సుకుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు..ఇప్ప‌టికే ఈ సినిమాకు సంబంధించి టీజ‌ర్, ట్రైల‌ర్ సాంగ్ ల‌ను విడుద‌ల చేయ‌గా ప్రేక్ష‌కుల నుంచి మంచి స్పంద‌న ల‌భిస్తోంది... గోదావ‌రి ప‌డ‌వ న‌డిపే చిట్టిబాబుగా రామ్ చ‌ర‌ణ్ న‌టిస్తుండ‌గా, రామ‌ల‌క్ష్మి పేరుతో పేదింటి పిల్ల‌గా స‌మంత న‌టిస్తోంది...
 
గ్రామీణ ప్రేమ క‌థ రూపంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రం... తాజా స‌మాచారం ప్ర‌కారం 1985 లో గోదావ‌రి ప‌రిస‌రాల ప్రాంతాల‌లో జ‌రిగిన రాజ‌కీయాల‌ను తెర‌కెక్కిస్తున్నట్లు తెలుస్తోంది... గ్రామ స్థాయి స‌ర్పంచ్ రాజ‌కీయం నుంచి మండ‌ల స్థాయి ఎన్నిక‌ల వ‌ర‌కు ఎలా జ‌రిగాయో వాటి స‌న్నివేశాల‌ను ద‌ర్శ‌కుడు చిత్రీక‌రించార‌ని  ఫిలిం న‌గ‌ర్ లో చెప్పుకుంటున్నారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.