"బాహుబలి"ని క్రాస్ చేసిన రామ్ చరణ్ సినిమా

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

prabhas and charan
Updated:  2018-09-08 03:56:33

"బాహుబలి"ని క్రాస్ చేసిన రామ్ చరణ్ సినిమా

మన తెలుగు రాష్ట్రల్లోనే కాక బాహుబలి ప్రపంచవ్యాప్తంగా ఎంత పెద్ద ఘనవిజయమో వసూళ్లు చూస్తే అర్ధం అవుతుంది. సుమారు రెండు వేల కోట్ల రూపాయలు ఒక్క రెండవ పార్టుకే వచ్చాయంటే  రెండు పార్టులు కలిపితే భారత దేశంలో నే అత్యధిక వసూళ్లు సాధించిన స్టోరీ అవుతుందని చెప్పడం లో అతిశయోక్తి లేదు. దాదాపు విడుదల అయిన ప్రతీ దేశంలోనూ మన బాహుబలి ఒక ముద్ర వేసింది. ఆయా దేశాల్లో విదులైన భారత చిత్రాల్లో ముందు వరుసలో నిలబడింది.

కాకపోతే ఒక్క జపాన్ లో బాహుబలిని మరో తెలుగు చిత్రం దాటేసింది. సుమారు వన్ మిలియన్ మార్క్ ని బాహుబలి క్రియేట్ చెయ్యగా రామ్ చరణ్ హీరోగా నటించిన ‘ మగధీర’ ఇప్పుడు ఆ రికార్డ్ ని బద్దలుకొట్టేసింది. అదెలా సాధ్యం అనుకుంటున్నారా? బాహుబలి తర్వాత అక్కడ రాజమౌళి సినిమాలకు క్రేజ్ పెరిగింది. దానిలో భాగంగా మగధీర ని అక్కడ డబ్బింగ్ చేశారు.ఇంకేముంది జపనీయులకు ఈ సినిమా కూడా తెగ నచ్చేయ్యడంతో బాహుబలిని క్రాస్ చేసేస్తోంది.ఇంకొక విషయం ఎంటటే, జపాన్ లో రజనీకాంత్ తెలియని వారుండరు.

అక్కడ ఆయనకు అక్కడ చాలా మార్కెట్ ఉంది. ఆయన నటించిన ముత్తు కలెక్షన్ల రికార్డ్ ఇంకా పదిలంగా ఉంది. ఆ సినిమా దాదాపు ఒకటిన్నర మిలియన్ సంపాదించి అగ్ర స్థానంలో నిలిచింది. ఇప్పటికే రెండవ స్థానంలోకి దూరిన మగధీర ఒకటో స్థానంలోకి వస్తాడా లేదా అనేది వేచి చూడాలి.

 

షేర్ :