సేదతీరుతున్న మెగాపవర్ స్టార్

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

ram charan
Updated:  2018-09-07 12:11:32

సేదతీరుతున్న మెగాపవర్ స్టార్

‘బ్రూస్లీ’ పరాజయంతో కనువిప్పు కలిగిన రాంచరణ్ వైవిధ్యమైన పాత్రలను మాత్రమే చెయ్యాలని గట్టిగా అనుకున్నాడు. ఆ ఫలితంగానే ‘ధ్రువ’, ‘రంగస్థలం’ లాంటి ఆణిముత్యాలు బాక్స్ ఆఫీస్ వద్ద సత్తా చాటాయి.నటుడుగా అప్పటివరకు విమర్శలు ఎదుర్కున్న చరణ్ రంగస్థలం తో నటుడిగా తానేంటో నిరూపించుకున్నాడు.
 
ఊహించిన స్థాయి కన్నా ఎక్కువే ఆడిన ఈ చిత్రం నాన్ బాహుబలి రికార్డ్స్ అన్ని బడ్డలుకొట్టేసింది. దర్శకుడి కంటే ఎక్కువ క్రెడిట్ కొట్టేశాడు కూడా. మెగాఫ్యామిలీ అభిమానులు ఇప్పుడు చరణ్ తీయ్యబోయే తర్వాతి చిత్రం ఏ రేంజ్ లో ఉండబోతుందా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
 
మళ్ళీ ఒక మాస్ సినిమా చేసి తన మాస్ అభిమానులను కూడా సంతృప్తి పరిచే పనిలో పడ్డాడు చరణ్. అందులో భాగంగానే ప్రస్తుతం మెగాపవర్ స్టార్ బోయపాటితో ఒక చిత్రం చేస్తున్నాడు. చిత్రీకరణ లో చురుగ్గా పాల్గొంటున్నాడు. ఒక పక్క ‘సైరా’ నిర్మాణ బాధ్యలను నిర్వహిస్తూనే మరోపక్క ఖైరా అద్వనితో సెట్ లో రొమాన్స్ చేస్తున్నాడు.
 
ప్పుడు చిత్రీకరణ మొత్తం ‘అజర్బైజాన్’ లో జరుగుతుంది. ఈ విషయాన్ని వెల్లడిస్తూ చరణ్ ఒక పిక్ ని సామాజిక మధ్యమాలలో పోస్ట్ చేసాడు. స్విమ్మింగ్ పూల్ లో సేదా తీరుతున్న చరణ్ వెనుకబాగం పిక్ ఇప్పుడు అభిమానులు షేర్ చేసుకుంటున్నారు.కండలు తిరిగిన దేహం, స్టైలిష్ గడ్డం తో స్టయిలిష్ మాస్ హీరోగా రాబోతున్నాడా? అని అభిమానులు అనుకుంటున్నారు.