రూ. 40 కోట్లు ఖ‌ర్చుపెట్టిన రామ్ చ‌ర‌ణ్

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

hero ram charan
Updated:  2018-06-29 11:00:12

రూ. 40 కోట్లు ఖ‌ర్చుపెట్టిన రామ్ చ‌ర‌ణ్

బిజినెస్ చేస్తూ సినిమాల్లో ఉన్నారు కాబ‌ట్టి రామ్ చ‌ర‌ణ్ ఎన్ని కోట్లు అయినా ఖ‌ర్చు చేయ‌చ్చు అంటారా, నిజ‌మే ప్ర‌పంచంలో మేటి అయిన హాస్ప‌ట‌ల్స్ అపోలో కుటుంబానికి అల్లుడు కూడా ఆయ‌న.. అయితే బిజినెస్ లు సినిమాల‌తో ఆయ‌న ఇటీవ‌ల మంచి బిజీ బిజీగా ఉంటున్నారు.. ఇటు రాజ‌మౌళి సినిమా  కూడా మ‌రో మూడు నెల‌ల్లో సెట్స్ పైకి వెళ్లే అవ‌కాశం ఉండ‌టంతో పాత వ‌ర్క్ లు అన్నీ కంప్లీట్ చేసుకుంటున్నారు చెర్రీ- ఎన్టీఆర్ లు..
 
ఇక తాజాగా ఆయ‌న మెగా స్టార్ చిరంజీవి న‌టిస్తున్న సైరా సినిమాని ప్రొడ్యూస్ చేస్తున్న విష‌యం తెలిసిందే.. ఈ సినిమా ఇప్ప‌టికే ప‌లు షూట్లు పూర్తి చేసుకుంది.. ఇప్ప‌టికే చిరంజీవి న్యూలుక్ -అమితాబ్ ఈ చిత్రంలో పోషించిన పాత్ర లుక్ ని షూటింగ్ స‌మ‌యంలో ఫోటోల‌ను విడుద‌ల చేశారు కొంద‌రు.. ఇక ఈ చిత్ర టీం ఈ సినిమాపై ఇప్ప‌టికే ఎంతో శ్ర‌ద్ద పెట్టి చేస్తోంది.  ఈ స‌మ‌యంలో తాజాగా సైరా గురించి ఓ వార్త వైర‌ల్ అవుతోంది.. ఈ చిత్రానికి సంబంధించి కీల‌క యుద్ద స‌న్నివేశాల‌ను రూపొందిస్తున్నార‌ట‌.. అది కూడా హాలీవుడ్ రేంజ్లో చేస్తున్నార‌ని, అక్క‌డ వారితో వ‌ర్క్ చేస్తున్నార‌ట ఈయుద్ద సన్నివేశాల చిత్రీక‌ర‌ణ‌.
 
ఈ యుద్ద స‌న్నివేశాల సెట్టింగులు గ్రాఫిక్స్ వ‌ర్క్స్ ఎలా ఉన్నా ఈ షెడ్యూల్ కోసం 40 కోట్ల రూపాయ‌లు చ‌ర‌ణ్ ఖ‌ర్చుచేశార‌ట.. ఇప్పుడు ఈ వార్త నిర్మాత‌ల స‌ర్కిల్స్ లో చ‌ర్చ జ‌రుగుతోంది.. మ‌రో ప‌క్క రోబో 2 కి ఎలా అయితే ఖ‌ర్చు చేశారో ఫైట్ సీన్ల‌కు ఇలా ఖ‌ర్చు చేస్తున్నార‌ని, ఈ సినిమా బ‌డ్జెట్ మ‌రింత పెరిగే అవ‌కాశం ఉంద‌ని, అనుకున్న 200 కోట్ల నుంచి పెరిగే అవకాశం ఉంద‌ని అంటున్నారు కొంద‌రు.. మ‌రి మెగా స్టార్  సినిమా అంటే ఆ రేంజ్ ఉండాల్సిందే అంటున్నారు ఆయ‌న అభిమానులు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.