నాకు ఓటమి అంటే అస్సలు భయం లేదు - రామ్ చరణ్

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

hero ram charan
Updated:  2018-08-16 06:32:51

నాకు ఓటమి అంటే అస్సలు భయం లేదు - రామ్ చరణ్

మెగా స్టార్ చిరంజీవి తనయుడిగా తెలుగు ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. తొలి సినిమాతో ప్లాప్ ని అందుకున్న రామ్ చరణ్ రెండవ సినిమా అయిన "మగధీర"తో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నాడు. కానీ మళ్ళీ మూడో సినిమా అయిన "ఆరంజ్" తో ప్లాప్ ని అందుకున్నాడు రామ్ చరణ్.

ఇకపోతే మళ్ళీ ఆ తరువాత వరుస పరాజయల్ని చవి చూసాడు రామ్ చరణ్. ఇదే సమయంలో నటన పరంగా కూడా ఎన్నో విమర్శలు అందుకున్నాడు ఈ మెగా హీరో. ఇదిలా ఉంటే ఇటివలే "రంగస్థలం" అనే సినిమాతో ఇండస్ట్రీ హిట్ కొట్టి నటన పరంగా కూడా వందకి వంద మార్కులు పొందాడు రామ్ చరణ్. అయితే రామ్ చరణ్ కి ఇది వరకు బాగా ఓటమి అంటే చాలా భయం ఉండేది అంట.

ఒకానొక టైం లో ప్లాప్ వచ్చినప్పుడు ఒక్కన్నే ఒక రూమ్ లో ఉండే వాణ్ణి. కేవలం మా అమ్మ వచ్చి నాకు భోజనం వడ్డించేది అంతే, ఇక మళ్ళీ ఎస్ రూమ్ లో నుంచి బయటకి వచ్చే వాడిని కూడా కాదు అంటూ చెప్పుకొచ్చాడు రామ్ చరణ్. అలాగే పెళ్లి తరువాత నాలో చాలా మార్పు వచ్చింది. ఇక అప్పటి నుంచి ఎప్పుడూ ఓటమికి భయపడలేదు అంటూ ఓటమిని ఎలా జయించాడో చెప్పాడు రామ్ చరణ్. ప్రస్తుతం రామ్ చరణ్, బోయపాటి శ్రీను దర్శకత్వంలో లో ఒక మాస్ సినిమా చేస్తున్నాడు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.