పనెండేళ్ళ నుంచి వాయిదా పడుతున్న "సై రా నరసింహ రెడ్డి"

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

ram charan
Updated:  2018-08-21 04:46:24

పనెండేళ్ళ నుంచి వాయిదా పడుతున్న "సై రా నరసింహ రెడ్డి"

మెగా స్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న సై రా నరసింహ రెడ్డి టీజర్ వచ్చేసింది. ఈ టీజర్ ఇప్పుడు  యూ ట్యూబ్ సునామి క్రియేట్ చేస్తుంది. ఈ సినిమాని కొణిదెల ప్రొడక్షన్స్ పై మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నిర్మిస్తున్నాడు. అయితే ఈ సినిమాని రామ్ చరణ్ పనెండేళ్ళ నుంచి నిర్మించాలి అనుకుంటున్నాడు అంట.

ఈ సినిమా గురించి రామ్ చరణ్ మాట్లాడుతూ "నాన్న గారు ఈ సినిమా కోసం చాలా కష్టపడుతున్నారు. ఈ సినిమా నాకు పనెండేళ్ళ కల. రచయితలు పరుచూరి బ్రదర్స్ లేకపోతే ఈ సినిమా తెరకెక్కేదె కాదు. ఎందుకంటే నాన్న గారికి ఈ సినిమా సెట్ అవుతుంది అని చెప్పింది వాళ్లే. ప్రతి ఇక్క మెగా అభిమాని గర్వపడే విధంగా "సై రా నరసింహ రెడ్డి" ఉంటుంది. ప్రస్తుతం ఈ సినిమాకి సంభందించిన షూట్ రామోజీ ఫిల్మ్ సిటీ లో జరుగుతుంది.

వచ్చే ఏడాది సమ్మర్ లో ఈ సినిమా ని థియేటర్స్ లో రిలీస్ చేస్తాము" అని రామ్ చరణ్ చెప్పాడు. ఇదిలా ఉంటే టీజర్ లో చిరంజీవిని చూసిన అభిమానులు ఈ సినిమా కోసం వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. అమిత్ త్రివేది సంగీతం అందించిన ఈ సినిమాలో నయనతార హీరోయిన్ గా నటిస్తుండగా అమితాబ్ బచ్చన్ ఒక ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.