తన అసిస్టెంట్ బాటలో నడుస్తున్న రామ్ గోపాల్ వర్మ

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

ram gopal varma
Updated:  2018-09-01 03:06:31

తన అసిస్టెంట్ బాటలో నడుస్తున్న రామ్ గోపాల్ వర్మ

సీనియర్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ గత కొంత కాలంగా ఫ్లాప్స్ లో ఉన్న సంగతి అందరికి తెలిసిందే. ఇటివలే "ఆఫీసర్" ఫ్లాప్ తో పూర్తిగా డీలా పడిపోయిన రామ్ గోపాల్ వర్మ తన అసిస్టెంట్ అయిన సిద్దార్థ్ ని దర్శకుడిగా పరిచయం చేస్తూ "భైరవగీత" అనే సినిమాని ప్రొడ్యూస్ చేసాడు.

ఈ సినిమా యొక్క ట్రైలర్ ఈరోజే రిలీజ్ అయ్యింది. ట్రైలర్ చూస్తుంటే రామ్ గోపాల్ వర్మ "రక్త చరిత్ర" "వంగీవీటి" సినిమాలు మనకి గుర్తు వస్తాయి. ఈ సినిమా కూడా ఆ సినిమాల్లాగే పూర్తీ స్థాయి విలేజ్ ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కింది. హింస తో పాటు కామం తో కూడిన అంశాలని ఈ ట్రైలర్ లో చూపించాడు రామ్ గోపాల్ వర్మ.

దాలి ధనుంజయ్, ఐరా ఈ సినిమా ద్వారా పరిచయం అవుతున్నారు. ఈ సినిమా త్వరలో తెలుగుతో పాటు కన్నడ లో కూడా రిలీజ్ కాబోతుంది. ఇదిలా ఉంటే ఈ ట్రైలర్ చూసిన వారు రామ్ గోపాల్ వరం తన అసిస్టెంట్ అజయ్ భుపతిని ఫాలో అవుతున్నాడు అని అర్ధం అవుతుంది. ఎందుకంటే ఈ సినిమా ట్రైలర్ లో అక్కడక్కడ "ఆర్ ఎక్ష్ 100" ఛాయలు మనకి కనిపిస్తాయి.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.