చాలా కాలం తర్వాత గుర్తుండిపోయే పాత్ర చేశానంటున్న తమిళ నటుడు

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

Updated:  2018-07-10 17:50:15

చాలా కాలం తర్వాత గుర్తుండిపోయే పాత్ర చేశానంటున్న తమిళ నటుడు

దాదాపు 30 ఏళ్ళ క్రితం విడుదలై సంచలన విజయం సాధించిన చిత్రం "సింధూరపువ్వు" ఆ చిత్రంలో హీరోగా నటించిన రాంకీ  గురించి అప్పటి సినీ ప్రేక్షకులలో తెలియని వారుండరు. అయితే ఆ తర్వాత రాంకీ పెద్దగా తెలుగులో నటించింది లేదు.
 
గత సంవత్సరం విడుదలైన "ఆకతాయి" చిత్రంతో చాలా కాలం తర్వాత తెలుగులో రీ-ఎంట్రీ ఇచ్చిన రాంకీ ప్రస్తుతం "RX 100" చిత్రంలో ఒక కీలకపాత్రను పోషించారు. అజయ్ భూపతి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కార్తికేయ, పాయల్ హీరో-హీరోయిన్స్ గా నటించారు.
 
అయితే ఈ చిత్రంలో తన పాత్ర తనకి చాలా సంతృప్తిని కలిగించిందని తెలిపారు రాంకీ, ఈ చిత్రంలో తన పాత్ర చాలా కీలకమైందని  హీరో కోసం అతని లైఫ్ కోసం నా పాత్ర అంకితం అయ్యే గొప్ప పాత్ర తనకి ఇచ్చినందుకు చిత్ర నిర్మాతలకు, దర్శకుడికి స్పెషల్ థాంక్స్ తెలిపారు నటుడు రాంకీ. ఇక  బోల్డ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన "RX 100" చిత్రం ఈ నెల 12న విడుదల అవుతోంది.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.