ఆ పాత్ర కోసం రానానే పెట్టాలి అని పట్టుబట్టిన బాలయ్య

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

balakrishna and rana daggubati
Updated:  2018-08-06 12:24:58

ఆ పాత్ర కోసం రానానే పెట్టాలి అని పట్టుబట్టిన బాలయ్య

ఆంధ్రుల ఆరాధ్య దైవం, విశ్వ విఖ్యాత న‌టుడు, మాజీ ముఖ్యమంత్రి అన్న నంద‌మూరి తార‌క రామారావు జీవిత క‌థ ఆధారంగా "ఎన్టీఆర్" పేరుతో ఓ సినిమా తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. క్రిష్ తెర‌కెక్కిస్తున్న ఈ సినిమాలో ఎన్టీయార్‌గా బాల‌య్య క‌నిపించ‌నున్నారు.

ఈ సినిమా కోసం బాల‌య్య తొలిసారి నిర్మాత‌గా కూడా మారుతున్నారు. ఎన్టీఆర్ భార్య పాత్ర‌లో బాలీవుడ్ హీరోయిన్ విద్యా బాల‌న్ న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. మ‌రో కీల‌క‌మైన పాత్ర‌లో యంగ్ హీరో రానా న‌టించ‌బోతున్న‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి. ఎన్టీఆర్ అల్లుడు అయిన నారా చంద్ర‌బాబు నాయుడు పాత్ర‌లో రానా క‌నిపించ‌బోతున్న‌ట్టు స‌మాచారం.

చంద్ర‌బాబులా క‌న‌పించేందుకు, ఆయ‌న హావాభావాలు ప‌లికించేందుకు రానా ప్ర‌త్యేకంగా స‌న్న‌ద్ధ‌మ‌వుతున్నాడ‌ట‌. ఇప్ప‌టికే రానా చేత డైరెక్ట‌ర్ క్రిష్ రిహార్స‌ల్స్ కూడా చేయించాడ‌ని తెలుస్తోంది. త్వ‌ర‌లోనే రానా షూటింగ్‌లో పాల్గొన‌బోతున్న‌ట్టు సమాచారం. ఇదిలా ఉంటే సడన్ గా బాలకృష్ణ కి రానా మీద ఎందుకింత ప్రేమ పుట్టుకొచ్చింది, అసలు రానానే ఈ పాత్ర చేయాలి అని బాలయ్య ఎందుకు అనుకున్నాడు అని అందరికి క్యూస్షన్ మార్క్.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.