సుధీర్ పెళ్ళిపై ర‌ష్మి క్లారిటీ

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

rashmi and sudheer
Updated:  2018-06-21 01:04:54

సుధీర్ పెళ్ళిపై ర‌ష్మి క్లారిటీ

బుల్లితెరలో ఓ ప్ర‌ముఖ‌ ఛాన‌ల్ ల్లో ప్ర‌సార‌మ‌య్యే జ‌బ‌ర్ద‌స్త్ షో ద్వారా తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌యం అయింది యాంక‌ర్ ర‌ష్మి. ఈ షోలో యాంక‌రింగ్ చేసి ఇరు తెలుగు రాష్ట్రాల ప్ర‌జ‌ల‌ను ఫిదా చేస్తుంది ఈ ముద్దుగుమ్మ‌. యంగ్ లేడీ యాంక‌ర్స్ లో ర‌ష్మి టాప్ యాంక‌ర్ గా కోన‌సాగుతోంది. అయితే ఈమె బుల్లితెరకు ఎంట్రీ ఇవ్వ‌క ముందు వెండితెర‌లో ప‌లు చిత్రాల్లో సైడ్ క్యారెక్ట‌ర్ లో నటించింది. కానీ ర‌ష్మి ప్రేక్ష‌కుల ద‌గ్గ‌ర నుంచి పెద్ద‌గా ఆద‌న‌ణ‌ చెంద‌లేదు. ఎప్పుడు అయితే బుల్లితెర‌కు యాంకర్ గా పరిచ‌య‌మ‌యిందో అప్ప‌టి నుంచి ర‌ష్మి తెలుగు రాష్ట్రాల్లో త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేకమై గుర్తింపు తెచ్చుకుంది. 
 
ఇక త‌న‌కు వ‌స్తున్న గుర్తింపును చూసి చిత్ర‌ప‌రిశ్ర‌మ‌కు చెందిన ద‌ర్శ‌క నిర్మాత‌లు తాము తెర‌కెక్కిస్తున్న‌ సినిమాల్లో హీరోయిన్ గా న‌టించ‌మ‌ని ఆఫ‌ర్స్ ఇస్తున్నారు. అయితే ఇప్ప‌టికే ఈ ముద్దుగుమ్మ ప్ర‌వీన్ స‌త్తార్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన చిత్రం గుంటూరు టాకీస్ లో హీరోయిన్ గా న‌టించింది. ఒక ప‌క్క యాంక‌రింగ్ మ‌రో ప‌క్క హీరోయిన్ గా న‌టిస్తూ రెండింటిలో ఈక్వ‌ల్ బ్యాలెన్స్ చేస్తూ వ‌స్తుంది ఈ ముద్దుగుమ్మ‌.
 
అలాగే ర‌ష్మికు సోష‌ల్ మీడియాలో కూడా ఫాలోయింగ్ బాగానే ఉంది. ఎప్ప‌టిక‌ప్పుడు త‌న ఫాలోవ‌ర్స్ సూచ‌న‌ల మేర‌కు ర‌ష్మి ఫాలో అవుతూ ఉంటుంది. తాజాగా ర‌ష్మి, సుధీర్ పెళ్ళి వీడియో ఒక‌టి ఇటీవ‌లే వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే.  ఈ వీడియోలో వారిద్ద‌రు పెళ్ళి చేసుకున్న‌ట్లు చూపించారు.
 
అయితే ఈ పెళ్లిపై  ఓ అభిమాని ట్విట్టర్ లో ర‌ష్మికి స‌రికొత్త‌ స‌ల‌హా ఇచ్చాడు. ఆ స‌ల‌హా ఏంటంటే మీరిద్ద‌రు చాలా క‌ష్ట‌ప‌డి పైకి వచ్చిన వార‌ని, మీ జంట చాలా బాగుందని, మీరిద్ద‌రు పెళ్ళి చేసుకోండి అని స‌ల‌హా ఇచ్చాడు. ఇక దీనిపై స్పందించిన‌ ర‌ష్మి కేవ‌లం మేము ప్రేక్ష‌కుల‌ను అల‌రించాడానికి మాత్ర‌మే అలా ఉంటాము తప్ప రియ‌ల్ లైఫ్ లో వేర్వేరు గా ఉంటాము ఇలాంటి విచ‌క్ష‌ణ స‌ల‌హాలు ఇవ్వ‌వ‌ద్ద‌ని ర‌ష్మి వార్నింగ్ ఇచ్చింది.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.