జీఎస్టీ - 2 లో ర‌ష్మీ

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

Updated:  2018-02-08 12:57:29

జీఎస్టీ - 2 లో ర‌ష్మీ

గ‌త నెలలో ఎన్నో వివాదాల‌ను, ఎదుర్కొటూ  విడుద‌లైన వెబ్ సిరీస్ చిత్రం గాడ్ సెక్స్ అండ్ ట్రూత్... ఈ సినిమాకు వివాదాస్ప‌ద ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు... ఈ చిత్రంలో అమెరికా పోర్న్ స్టార్ మియా మాల్కోవా న‌టించారు.
 
వివాదాల‌కు కేరాఫ్ అడ్ర‌స్ గా మారిన వ‌ర్మ ఈ సినిమాతో మ‌రింత వివాదంలో ఇరుక్కున్నారు... అయితే ఒక వైపు ఈ చిత్రాన్ని మ‌హిళా సంఘాలు వ్య‌తిరేకిస్తుంటే, మ‌రోవైపు ఈ సినిమా  త‌ర‌హాలోనే జీఎస్టీ 2 చిత్రాన్ని తీస్తానంటూ కొంత మంది డైరెక్ట‌ర్లు ముందుకు వ‌స్తున్నారు... 
 
అయితే ఈ క్ర‌మంలో తాజాగా జీఎస్టీ 2 లో న‌టించేందుకు కొంత‌మంది హీరోయిన్ లు ఆస‌క్తి చూపుతున్నారు...  శృంగార న‌టిగా గుర్తింపు తెచ్చుకున్న ష‌కీలా...వ‌ర్మ నెక్ట్స్  జీఎస్టీ 2 సినిమా తీస్తే తాను న‌టించ‌డానికి సిద్దంగా ఉన్నాన‌ని చెప్పారు. 
 
ఈ నేప‌థ్యంలో  బుల్లి తెర‌కు జ‌బ‌ర్ద‌స్త్ షో ద్వారా ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌య‌మైన ర‌ష్మీ గౌత‌మ్ ను,  సోష‌ల్ మీడియాను వేదిక‌గా చేసుకుని  నెటీజ‌న్లు ప‌లు ప్ర‌శ్న‌లు అడిగారు... జీఎస్టీ -2 లో న‌టించేందుకు మీరు సిద్దంగా ఉన్నారా అని ర‌ష్మీ ని అడ‌గ‌గా... తాను సిద్దంగా ఉన్నాన‌ని చెప్పారు... కాకపోతే ఈ సినిమాకు ప్ర‌వీణ్ స‌త్తార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తే క‌చ్చితంగా జీఎస్టీ -2 లో న‌టిస్తాన‌ని తెలిపారు ర‌ష్మీ.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.