బెంగుళూరుకి వెళ్ళాలి అంటేనే భయపడుతున్న రష్మిక

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

rashmika
Updated:  2018-10-13 12:01:46

బెంగుళూరుకి వెళ్ళాలి అంటేనే భయపడుతున్న రష్మిక

ఈ ఏడాది ఛలో గీత గోవిందం, దేవదాస్ సినిమాలతో హిట్స్ అందుకొని బిజీ హీరోయిన్ గా మారిపోయింది రష్మిక. కానీ గత కొంత కాలంగా రష్మిక సోషల్ మీడియా లో ఎక్కడ చూసిన హలచల్ చేస్తుంది. ఎందుకంటే రష్మిక కన్నడ నటుడు, డైరెక్టర్ అయిన రక్షిత్ శెట్టి తో ఎంగేజ్మెంట్ రద్దు చేసుకుంది.  దాంతో కన్నడిగులు రష్మికపై సోషల్ మీడియాలో అసభ్య కామెంట్స్ పెడుతూ ట్రోల్ చేస్తున్నారట.

దాంతో రష్మిక సోషల్ మీడియాకు దూరంగా ఉండటమే కాకుండా తన సొంత ఊరు బెంగుళూరు వెళ్ళడానికి కూడా భయపడుతుంది అంట. కన్నడిగులకు కొద్దిరోజుల పాటు దూరంగా ఉండాలి అని డిసైడ్ అయ్యింది అంట రష్మిక. ప్రస్తుతం వరుస విజయాలతో ఊపుమీదున్న రష్మికకు వరుస అవకాశాలు దక్కాయి.

ప్రస్తుతం విజయ్ దేవరకొండ సరసన డియర్ కామ్రేడ్ సినిమాలో అలాగే నితిన్ హీరోగా భీష్మ సినిమాలో నటిస్తుంది రష్మిక. కన్నడ లో మాత్రం ఒక్క సినిమా కూడా సైన్ చెయ్యట్లేదు రష్మిక. ఇక కన్నడ వాళ్ళు అయితే నీకు తెలుగు సినిమా మీద ప్రేమ ఎక్కువై మమల్ని మర్చిపోయావు అంటూ రష్మిక పై సీరియస్ గా ఉన్నారు. మరి రష్మిక పై వారు పెంచుకున్న ఈ కోపం ఎప్పటికి తగ్గుతుందో.

షేర్ :